Shilpa Shetty Leg Broken: షూటింగ్‌లో కాలు విరగ్గొట్టుకున్న హీరోయిన్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకున్న నటి శిల్పా శెట్టి, ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, పలు టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ షూటింగ్‌లో గాయపడింది.

Shilpa Shetty Leg Broken: షూటింగ్‌లో కాలు విరగ్గొట్టుకున్న హీరోయిన్..!

Updated On : August 10, 2022 / 8:48 PM IST

Shilpa Shetty Leg Broken: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకున్న నటి శిల్పా శెట్టి, ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, పలు టీవీ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక తన అభిమానులకు కావాల్సినంత స్టఫ్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ షూటింగ్‌లో గాయపడింది.

Shilpa Shetty : శిల్పాశెట్టి అందానికి కారణం ఇదే..

శిల్పా శెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ మూవీ కోసం షూటింగ్ చేస్తుండగా, ఆమె కాలు విరిగింది. యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ఓ హై వోల్టేజ యాక్షన్ సీన్ కోసం రెడీ అయిన శిల్పా, షూటింగ్‌లో భాగంగా కాలు విరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, డాక్టర్లు ఆమెకు కనీసం 6 వారాల రెస్ట్ తప్పనిసరి అని తెలిపారట.

Shilpa Shetty – Raj Kundra : జరుగుతున్న ఆస్తుల పంపకాలు.. బాలీవుడ్‌లో మరో విడాకులు?..

దీంతో ఆసుపత్రిలో నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో శిల్పా ఓ ఫోటోను షేర్ చేసింది. తాను 6 వారాల వరకు కనిపించనని, ఈ లోగా తన అభిమానులు తనకు త్వరగా నయం కావాలని భగవంతుణ్ణి ప్రార్ధించాల్సిందిగా కోరింది ఈ స్టార్ బ్యూటీ.