Shilpa Shetty – Raj Kundra : జరుగుతున్న ఆస్తుల పంపకాలు.. బాలీవుడ్‌లో మరో విడాకులు?..

తాజాగా రాజ్‌కుంద్రా తన పేరుపై ఉన్న కొన్ని ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా తన పేరుపై ఉన్న విలువైన.......

Shilpa Shetty – Raj Kundra :  జరుగుతున్న ఆస్తుల పంపకాలు.. బాలీవుడ్‌లో మరో విడాకులు?..

Rajkundra

Shilpa Shetty – Raj Kundra :   ఇటీవల సినీ ప్రముఖుల్లో విడాకులు ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా సినీ సెలబ్రిటీలు తాము విడిపోతున్నట్టు తెలుపుతున్నారు. ఈ వరుస విడాకులు అభిమానుల్ని కలవరపెడుతున్నాయి. విడాకులు తీసుకుంటున్నట్టు చెప్తున్నా, వీటికి కారణాలు మాత్రం చెప్పకపోవడంతో ఈ సెలబ్రిటీ కపుల్స్ పై మరింత ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా బాలీవుడ్లో మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో శిల్పాకి భర్తతో విభేదాలు వచ్చినట్టు తెలుస్తుంది. శిల్పా అతడితో విడాకులు తీసుకోనుందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anasuya : బిజెపి నేత నిర్మాణంలో సునీల్, అనసూయ మెయిన్ లీడ్స్‌గా సినిమా

తాజాగా రాజ్‌కుంద్రా తన పేరుపై ఉన్న కొన్ని ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్‌గా తన పేరుపై ఉన్న విలువైన కొన్ని ఆస్తులను రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి పేరు మీదకు మార్చినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. రాజ్‌కుంద్రా ముంబై జుహులోని ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించాడట. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్‌ వ్యూ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లను కూడా శిల్పా పేరు మీదకు మార్చాడట.

Sohel : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. మూడో సినిమా షూట్ మొదలుపెట్టిన సోహెల్..

మరి సడెన్‌గా కొన్ని ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చడం వెనుక అంతర్యం ఏమిటి? అని ఆలోచిస్తున్నారు. ఇటీవల శిల్ప కూడా తన భర్తతో కలిసి ఉన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమి పోస్ట్ చేయకపోవడంతో వీరి విడాకుల వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి. మరి ఇవి రూమర్స్ లేక నిజమా తెలియాలి అంటే ఈ సెలబ్రిటీ కపుల్ లో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.