Chinmayi Sripada : సమంతతో నా ప్రయాణం ముగిసిపోయింది.. కానీ మేము విడిపోలేదు..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ.. ''సమంతకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఇప్పుడు కూడా మేమిద్దరం మంచి స్నేహితులం. సమంత ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతుంది. అందుకే..................

Chinmayi Sripada : సమంతతో నా ప్రయాణం ముగిసిపోయింది.. కానీ మేము విడిపోలేదు..

chinmayi sripada gives clarity on issues with samantha

Chinmayi Sripada :  చిన్మయి శ్రీపాద సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించింది. అయితే చిన్మయికి పేరు వచ్చింది మాత్రం సమంత వల్లే అని అందరికి తెలిసిందే. సమంత మొదటి సినిమా ఏమాయ చేసావేలో సమంతకి మొదటి సారి డబ్బింగ్ చెప్పింది చిన్మయి. ఈ సినిమాలో సమంత యాక్టింగ్ తో పాటు తన వాయిస్ కూడా బాగా పాపులర్ అయింది. ప్రేక్షకులు సమంత వాయిస్ కి ఫిదా అయిపోయారు. ఆ వాయిస్ వెనుక ఉన్నది చిన్మయి అని తెలిసిన తర్వాత తనకి పాపులారిటీ బాగా పెరిగింది.

ఏమాయ చేసావే సినిమా రిలీజ్ తర్వాత చిన్మయికి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆఫర్లు క్యూ కట్టాయి. దీంతో చిన్మయి స్టార్ గా మారిపోయింది. అలాగే సమంత, చిన్మయి మంచి స్నేహితులుగా మారారు. అయితే గత కొన్ని సినిమాల నుంచి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. దీంతో చిన్మయికి అవకాశాలు తగ్గాయి. అంతే కాకుండా వీరిద్దరూ ఇటీవల కలిసినట్టు కనపడలేదు, ఫోటోలు కూడా పోస్ట్ చేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి.

BiggBoss 6 : టైటిల్ తీసుకొని బయటకి వస్తా.. ఎన్నో వదిలేసుకొని వెళ్తున్నా.. బిగ్‌బాస్ ఎంట్రీ లీక్ చేసేసిన సింగర్ రేవంత్

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్మయి మాట్లాడుతూ.. ”సమంతకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. ఇప్పుడు కూడా మేమిద్దరం మంచి స్నేహితులం. సమంత ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతుంది. అందుకే సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అది మంచి విషయమే, అందులో నాకు ఎలాంటి సమస్య లేదు. ఇక మేము కలుస్తున్నామని జనాలకి తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయము. ఇటీవల కూడా మేము కలిశాము. సమంతకి నేను డబ్బింగ్ చెప్పినా చెప్పకపోయినా మేమిద్దరం ఎప్పటికి మంచి స్నేహితులమే. సమంతకి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. కేవలం వర్క్ పరంగా మాత్రమే సమంతతో నా ప్రయాణం ముగిసింది అంతే కానీ మేము ఇద్దరం కలిసే ఉన్నాము” అని తెలిపింది.