Chiranjeevi : మేం ఏం చేయాలో మాకు తెలీదా? మీడియాపై ఫైర్ అయిన చిరంజీవి.. అంతలోనే..

చిరంజీవి మాట్లాడుతూ.. ''రిలీజ్ కి ముందు మీడియా సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా............

Chiranjeevi : మేం ఏం చేయాలో మాకు తెలీదా? మీడియాపై ఫైర్ అయిన చిరంజీవి.. అంతలోనే..

Chiranjeevi fires on media at godfather success meet

Chiranjeevi :  చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.

ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ మీడియాపై ఫైర్ అయ్యారు. అంతలోనే మళ్ళీ పొగిడారు. సినిమా రిలీజ్ కి ముందు గాడ్ ఫాదర్ గురించి ఇష్టమొచ్చినట్టు మీడియా వార్తలు రాసిందని ఫైర్ అయ్యారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ”రిలీజ్ కి ముందు మీడియా సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని, సినిమాలో ఏం లేదు అని, రీమేక్ సినిమా అంత హైప్ లేదని రాశారు. మాకు ఆ వార్తలు చాలా ఇబ్బంది, చిరాకు కలిగించాయి. మా సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలీదా. మీడియా ఎందుకు డిస్ట్రబెన్స్ చేస్తుంది అని ఆలోచించాము. డైరెక్టర్, నేను, నిర్మాత దీనిపై మాట్లాడుకున్నాము. అసలే సినిమా లేట్ అవుతుందని మేము కంగారు పడుతుంటే మధ్యలో మళ్ళీ దీని గురించి ఆలోచించాము.”

Chiranjeevi : ఇది ఇంద్ర, ఠాగూర్ రేంజ్ సినిమా.. క్లైమాక్స్ 20 రోజుల ముందు మళ్ళీ రీషూట్ చేశాం..

”ఆ రోజు వర్షంలో కూడా మాట్లాడాను అంటే మీడియా ఏది పడితే అది రాస్తారని, వర్షం పడి ఈవెంట్ రసాభాస అయింది అని రాయకూడదని నేను వర్షంలో మాట్లాడాను. మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తారని నేను మైక్ తీసుకొని ఎవర్ని వద్దని నేను వర్షంలో అలాగే మాట్లాడాను. ఎవ్వరూ నెగిటివ్ గా మాట్లాడొద్దు అని. ఇప్పుడు మీడియా అంతా హిట్ అయినందుకు బాగా రాస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి మీడియా సినిమా గురించి బాగా రాశారు. సినిమా ముందు మమ్మల్ని టెన్షన్ పెట్టారు మీడియా కానీ రిలీజ్ అయ్యాక బాగా ప్రమోట్ చేశారు అందుకు చాలా థ్యాంక్స్” అని తెలిపారు. ఓ పక్కన మీడియాపై సీరియస్ అయి మరోపక్క వెంటనే థ్యాంక్స్ చెప్తూ మాట్లాడారు చిరంజీవి.