Chiranjeevi : ఇది ఇంద్ర, ఠాగూర్ రేంజ్ సినిమా.. క్లైమాక్స్ 20 రోజుల ముందు మళ్ళీ రీషూట్ చేశాం..

ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ''ఎన్ని సినిమాలు చేసినా, ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా కూడా ఓ కొత్త అనుభూతే. సినిమాకు ఎన్ని డబ్బులొచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎంతమంది చూసి వావ్‌ అన్నారన్నది ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్‌’ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌.............

Chiranjeevi : ఇది ఇంద్ర, ఠాగూర్ రేంజ్ సినిమా.. క్లైమాక్స్ 20 రోజుల ముందు మళ్ళీ రీషూట్ చేశాం..

Chiranjeevi :  చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.

ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ”ఎన్ని సినిమాలు చేసినా, ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా కూడా ఓ కొత్త అనుభూతే. సినిమాకు ఎన్ని డబ్బులొచ్చాయన్నది ముఖ్యం కాదు, ఎంతమంది చూసి వావ్‌ అన్నారన్నది ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్‌’ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ అని అందరూ అంటున్నారు. మరోసారి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వస్తారని రుజువు చేశారు ప్రేక్షకులు. లూసిఫర్ సినిమాలో కొన్ని చేంజెస్ చేసి చేశాము. చరణ్ వచ్చి ఈ సినిమా చేద్దాం అన్నాడు, నిర్మాతగా కూడా ఉంటా అన్నాడు. దర్శకుడిగా మోహన్ రాజా గురించి చెప్పినప్పుడు మంచి డెసిషన్ అనిపించింది. నా ఇన్ పుట్స్, సత్యానంద్, నిర్మాత.. ఇలా అందరి ఇన్ పుట్స్ తీసుకొని ఈ సినిమా చేశాము.”

”ఈ సినిమాకి ముందుగా ఓ క్లైమాక్స్‌ షూట్‌ చేశాం. అవుట్ పుట్ చూసిన తర్వాత ఇంకా బెటర్ గా బాగుంటే మంచిది అనిపించింది. ఆ తర్వాత మళ్లీ క్లైమాక్స్‌ను సినిమా రిలీజ్ కి 20 రోజుల ముందు షూట్ చేశాం. సినిమాను నేను ఓ క్రిటిక్‌గా చూసినప్పుడు తప్పులు తెలుస్తాయని నా గట్‌ ఫీలింగ్‌. ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో చిరంజీవి కళ్లతో యాక్ట్‌ చేశారు అని అంటుంటే ఆ క్రెడిట్‌ టీమ్‌ అందరికి దక్కుతుంది. చివరి నిమిషంలో టెక్నీషియన్స్ అంతా నిద్ర పోకుండా చేశారు. ఒరిజినల్ కంటే కూడా బాగా చేశాము.”

”రిలీజ్ కి ముందు మీడియా సినిమా గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాశారు. సినిమా షూట్ లేట్ అయిందని, సినిమా బాగోలేదు అని, ప్రమోషన్స్ మొదలు పెట్టలేదని రాశారు. మాకు ఆ వార్తలు ఇబ్బంది, చిరాకు కలిగించాయి. మా సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేయాలో మాకు తెలీదా. మీడియా ఎందుకు డిస్ట్రబెన్స్ దీనికి అని ఆలోచించాము. ఆ రోజు వర్షంలో కూడా మాట్లాడాను అంటే మీడియా ఏది పడితే అది రాస్తారని మాట్లాడాను. మీడియా ఇష్టం వచ్చినట్టు రాస్తారని నేను మైక్ తీసుకొని వర్షంలో మాట్లాడాను. ఎవ్వరూ నెగిటివ్ గా మాట్లాడొద్దు అని. ఇప్పుడు మీడియా అంతా హిట్ అయినందుకు బాగా రాస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రతి మీడియా సినిమా గురించి బాగా రాశారు. సినిమా ముందు మమ్మల్ని టెన్షన్ పెట్టారు మీడియా కానీ రిలీజ్ అయ్యాక బాగా ప్రమోట్ చేశారు అందుకు థ్యాంక్స్.”

NV Prasad : ప్రజారాజ్యంలోంచి పుట్టిన బాధ, ఆవేశమే జనసేన.. చిరంజీవి ఆస్తులు అమ్మి పార్టీ అప్పులు తీర్చారు..

”ప్రేక్షకులు కూడా మారిపోయారు. కంటెంట్ లో దమ్ము ఉంటే వాళ్ళు ఆదరిస్తారు. సాంగ్స్, ఫైట్స్ అవసర్లేదు. నా లైఫ్ లో అత్యద్భుతమైన సినిమాలు ఓ 15 ఉంటే అందులో గాడ్ ఫాదర్ కూడా ఒకటిగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ అడగ్గానే ఒప్పుకున్నాడు. రెమ్యునరేషన్ పంపిస్తే చిరు, చరణ్ మీదున్న అభిమానంతో చేస్తున్నా డబ్బులతో కొంటావా దాన్ని అని తిట్టి పంపించాడు రెమ్యునరేషన్ తీసుకోకుండా. ఏ ఒక్కరూ గొప్ప కాదు. అందరూ కూర్చొని అందరి ఇన్ పుట్స్ తీసుకోవాలి. అప్పుడే సినిమా బాగా మహిత్ అవుతుంది” అని అన్నారు.

అలాగే సినిమాకి పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు. మెగా 154 సినిమా గురించి మాట్లాడారు. గ్రాండ్ గా జరిగిన ఈ సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి స్పీచ్ హైలెట్ గా నిలిచింది. లీక్ చేసిన చిరంజీవి.