Mega 154 : మెగా 154 సినిమా గురించి లీక్ చేసేసిన చిరంజీవి

ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ చివర్లో మెగా 154 సినిమా గురించి లీక్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ''నెక్స్ట్ బాబీ సినిమా రాబోతుంది. గాడ్ ఫాదర్ లో నా క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉంటే బాబీ సినిమాలో.............

Mega 154 : మెగా 154 సినిమా గురించి లీక్ చేసేసిన చిరంజీవి

chiranjeevi leaks about Mega 154

Mega 154 :  చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.

ఇక ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ చివర్లో మెగా 154 సినిమా గురించి లీక్ చేసేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ”నెక్స్ట్ బాబీ సినిమా రాబోతుంది. గాడ్ ఫాదర్ లో నా క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉంటే బాబీ సినిమాలో చాలా అల్లరిగా ఉంటుంది. నా కాళ్ళకి బాగా పనిచెప్పాడు. అది ఒక రౌడీ అల్లుడు లాంటి సినిమా అవుతుంది. చాలా అల్లరి చిల్లరిగా ఉంటుంది. అందరికి నచ్చేలా నా ఒకప్పటి సినిమాల్లాగా ఉంటుంది” అని తెలిపారు.

Chiranjeevi : మేం ఏం చేయాలో మాకు తెలీదా? మీడియాపై ఫైర్ అయిన చిరంజీవి.. అంతలోనే..

చిరంజీవి మెగా 154 సినిమా గురించి చెప్పిన దాన్నిబట్టి చూస్తే ఇది పక్కా కమర్షియల్ సినిమా అని, ఫుల్ కామెడీ, డ్యాన్సులు అందబోతున్నాయని అర్థమైపోతుంది. దీంతో సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు పెంచేశారు.