Dhoni : D ఎంటర్టైన్మెంట్.. ధోని ఎంటర్టైన్మెంట్.. సినిమా మొదలుపెట్టేశాడుగా..

తన నిర్మాణ సంస్థకి D ఎంటర్టైన్మెంట్ అనే పేరుని పెట్టాడు. చెన్నైలో తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ఓపెన్ చేశాడు ధోని. తన మొదటి సినిమాని తమిళ్ లో నిర్మించనున్నాడు. ఈ సినిమాకి...........

Dhoni : D ఎంటర్టైన్మెంట్.. ధోని ఎంటర్టైన్మెంట్.. సినిమా మొదలుపెట్టేశాడుగా..

Dhoni started his production office D Entertainment

Dhoni :  భారత క్రికెట్ కి ఎన్నో విజయాలు, వరల్డ్ కప్ అందించిన గొప్ప క్రికెటర్ ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి తనకి నచ్చిన పనులు చేస్తూ, లైఫ్ ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ధోని త్వరలో సినిమా రంగంలోకి రానున్నాడు, సినిమాలు నిర్మించబోతున్నాడు అని పలు వార్తలు వచ్చాయి. తాజాగా దీపావళి నాడు ధోని తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి తన మొదటి సినిమాని ప్రకటించాడు.

తన నిర్మాణ సంస్థకి D ఎంటర్టైన్మెంట్ అనే పేరుని పెట్టాడు. చెన్నైలో తన ప్రొడక్షన్ ఆఫీస్ ని ఓపెన్ చేశాడు ధోని. తన మొదటి సినిమాని తమిళ్ లో నిర్మించనున్నాడు. ఈ సినిమాకి ధోని భార్య సాక్షి కథని అందించగా రమేష్ తమిళమని దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉండబోతోంది అని ప్రకటించారు. త్వరలోనే సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియచేస్తామన్నారు.

Kantara : మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి.. ‘కాంతార’పై పూజాహెగ్డే కామెంట్స్..

ఇన్నాళ్లు క్రికెట్ గ్రౌండ్స్ లో విజయం సాధించిన ధోని సినిమా రంగంలో ఎలాంటి విజయాలు సాధిస్తాడో చూడాలి మరి. త్వరలో మరిన్ని సినిమాలు కూడా ప్రకటించనున్నట్టు తెలిపారు.