Kantara : మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి.. ‘కాంతార’పై పూజాహెగ్డే కామెంట్స్..

తాజాగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఈ సినిమాపై కామెంట్స్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. కాంతార సినిమా చూసిన పూజా హెగ్డే................

Kantara : మీకేం తెలుసో దాన్నే కథగా రాయండి.. ‘కాంతార’పై పూజాహెగ్డే కామెంట్స్..

Pooja Hegde Comments on Kantara Movies

Kantara :  రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కాంతార. కన్నడలో మొదట రిలీజయి మంచి విజయం సాధించింది. ఆ తర్వాత హిందీ, తెలుగులో రిలీజయి భారీ విజయం సాధించింది. 20 కోట్లతో ఈ సినిమా తీస్తే ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాను అభినందిస్తున్నారు.

BiggBoss 6 Day 50 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా??

తాజాగా బుట్టబొమ్మ పూజాహెగ్డే ఈ సినిమాపై కామెంట్స్ చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. కాంతార సినిమా చూసిన పూజా హెగ్డే.. ”మీకు ఏం తెలుసో దాన్నే కథగా రాయండి. మీ మనసుకి నచ్చిన, మనసులోంచి వచ్చిన కథలనే చెప్పండి. కాంతార సినిమాలోని చివరి 20 నిముషాలు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ విజువల్స్, వారి నటన చాలా అద్భుతంగా ఉంది. రిషబ్ శెట్టి కాంతార సినిమా ఇంత భారీ విజయం సాధించినందుకు గర్వంగా ఉంది. నా చిన్నప్పుడు చూసిన భూతకోల నృత్యాలని ఈ సినిమాలో ఎంతో బాగా చూపించి పెద్ద హిట్ కొట్టావు. రానున్న రోజుల్లో నువ్వు మరిన్ని విజయాలు సాధించాలి” అని రిషబ్ శెట్టిని అభినందించింది.