Amala Paul : ఎవరికీ తెలియకుండా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందా..? అది కూడా ఫెయిల్ అయిందా..?

Amala Paul : ఎవరికీ తెలియకుండా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందా..? అది కూడా ఫెయిల్ అయిందా..?

Did Amalapal get married for the second time without anyone knowing?

Amala Paul :  హీరోయిన్‌ అమలాపాల్‌ ఇటీవల తన మాజీ ప్రియుడు భవీందర్‌ సింగ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసి అతనిపై పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భవీందర్‌ ని అరెస్ట్ చేశారు. తాజాగా అతను బెయిల్‌ కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తూ 2017లోనే అమలాపాల్‌తో తన పెళ్లి జరిగిందని, అందుకు సంబంధించిన సాక్షాలని కూడా కోర్టుకి ఇచ్చాడు. వీటిని పరిశీలించిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.

దీంతో అమలాపాల్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. అమలాపాల్‌ 2014లో దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది అందరికి తెలుసు. ఆ తర్వాత వీరిమధ్య విబేధాలు రావడంతో 2017లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని రోజులు అమలాపాల్ సింగర్‌ భవీందర్‌ సింగ్‌తో లవ్‌లో ఉన్నట్లు, వీరిద్దరికి పెళ్లి అయినట్టు వార్తలు వచ్చినా అమలాపాల్ అలాంటివేం లేవని కొట్టిపారేసింది.

BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

Did Amalapal get married for the second time without anyone knowing?

 

గతంలో అమలాపాల్‌- భవీందర్‌ సింగ్‌ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు బయటకి రాగా అది ఒక ప్రమోషనల్ షూట్ అని చెప్పింది. ఇప్పుడు భవీందర్ కోర్టులో తనకి, అమలాపాల్ కి పెళ్లి జరిగిందని చెప్పడంతో ఆంతా ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్ ఎవరికీ తెలీకుండా రెండో పెళ్లి చేసుకుందా? దాంట్లో కూడా విబేధాలు వచ్చి భవీందర్ తో విడిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వార్తలపై అమలాపాల్‌ మాత్రం స్పందించలేదు.