BiggBoss 6: బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌ కీర్తి కేశవ్ భట్‌ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 తొలి కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటి కీర్తి కేశవ భట్‌ ఎంట్రీ ఇచ్చింది. కాగా "కీర్తి నేను నీతో మాట్లాడుతుంటే నీకు ఏదో కథ ఉంది అనిపిస్తుంది" అని అడిగిన నాగార్జున ప్రశ్నకు కీర్తి బదులు ఇస్తూ.."మా అమ్మ-నాన్న, అన్నయ్య-వదిన, వాళ్ళ పాప, నేను ఒక రోజు టెంపుల్ వెళ్లివస్తుండగా...

BiggBoss 6: బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌ కీర్తి కేశవ్ భట్‌ గురించి మీకు తెలుసా..

Do You Know About BigBoss Contestant Keerti Kesav Bhatt

BiggBoss 6: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

ఈ సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా సీరియల్‌ నటి కీర్తి కేశవ భట్‌ ఎంట్రీ ఇచ్చింది. గాంధారీ… గాంధారీ అంటూ డ్యాన్స్‌తో సందడి చేసింది. కీర్తి భట్‌ ప్రస్తుతం “కార్తీక దీపం” సీరియల్ లో నటిస్తుంది. కార్తీకదీపం కంటే ముందు “మనసిచ్చి చూడు” సీరియల్‌తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది కీర్తి. ఇప్పుడు కార్తీకదీపం సీరియల్‌ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడవడంతో కీర్తి భట్‌ కి కొంత గ్యాప్ రావడం, ఎలాగో కీర్తి భట్ డేట్స్ నిర్వాహుకుల వద్ద లాక్ అయ్యి ఉండడంతో ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా తీసుకున్నారు.

BiggBoss 6 : బిగ్‌బాస్‌‌లో లవ్ స్టోరీ షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ కపుల్.. అమలతో ప్రేమ ప్రయాణం గురించి నాగార్జున కూడా..

కాగా “కీర్తి నేను నీతో మాట్లాడుతుంటే నీకు ఏదో కథ ఉంది అనిపిస్తుంది” అని అడిగిన నాగార్జున ప్రశ్నకు కీర్తి బదులు ఇస్తూ..”మా అమ్మ-నాన్న, అన్నయ్య-వదిన, వాళ్ళ పాప, నేను ఒక రోజు టెంపుల్ వెళ్లివస్తుండగా ఆక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు.. ఒక్క నేను తప్ప. ఆ తరువాత నేను ఎవరు లేరన్న షాక్ లో కొన్నాళ్లు కోమాలోకి కూడా వెళ్ళాను. ఇక నా బంధువులైతే నా ప్రోపర్టీస్ పంచుకుని నన్ను రోడ్ కి వదిలేసారు. కానీ నేను ఇవాళ ఇలా బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నా” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కీర్తి ఒక పాపని దత్తత తీసుకున్నట్టు కూడా ఈ షోలో వెల్లడించింది.