BiggBoss 6 : నేడే ఆట మొదలు.. ఈ సారి బిగ్‌బాస్‌ లో ఉండేది వీళ్లేనా..?

బిగ్‌బాస్‌ లీక్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి హౌస్ లో.. సింగర్ రేవంత్, గలాటా గీతూ, బిగ్‌బాస్‌ రివ్యూ లతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి, సిరి హనుమంత్ బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి...........

BiggBoss 6 : నేడే ఆట మొదలు.. ఈ సారి బిగ్‌బాస్‌ లో ఉండేది వీళ్లేనా..?

biggboss 6 contestants

BiggBoss 6 :  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్ నేడు ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ 6వ సీజన్ నాగార్జున హోస్ట్ గా నేడు ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది. ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలతో అర్థమైపోయింది. దీంతో బిగ్‌బాస్‌ అభిమానులు, ప్రేక్షకులు షో కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉండబోతున్నారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

బిగ్‌బాస్‌ మొదలయ్యేవరకు నిర్వాహకులు కంటెస్టెంట్స్ పేర్లు బయటకి చెప్పరు. కానీ కొంతమంది పేర్లు బయటకి లీక్ అవుతూ ఉంటాయి. ఈ సారి షోలో ఎవరెవరు ఉన్నారో కచ్చితంగా తెలియకపోయినా కొన్ని పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఉండబోతున్నట్టు గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు.

Chinmayi Sripada : సమంతతో నా ప్రయాణం ముగిసిపోయింది.. కానీ మేము విడిపోలేదు..

బిగ్‌బాస్‌ లీక్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి హౌస్ లో.. సింగర్ రేవంత్, గలాటా గీతూ, బిగ్‌బాస్‌ రివ్యూ లతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి, సిరి హనుమంత్ బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, జబర్దస్త్ కమెడియన్‌ చంటి, నటుడు బాలాదిత్య, నటుడు షాని, నటి సుదీప, యాంకర్‌ ఆరోహీ రావ్‌, సీరియల్‌ నటి శ్రీ సత్య, ఆర్జీవీ వీడియోలతో పాపులర్ అయిన ఇనయా సుల్తానా, జబర్దస్త్ లేడీ కమెడియన్‌ ఫైమా, కపుల్స్ రోహిత్‌, మరీనాలు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు సాధారణ ప్రజలు కూడా ఉందనున్నట్టు సమాచారం. మరి వీరిలో చివరికి స్టేజి మీద ఎవరు కనిపిస్తారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.