KGF : ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఈ రాజకీయ నాయకుడికి బంధువే.. మీకు తెలుసా??

ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంత్ తండ్రి సుభాష్ తనకి బంధువు అని, ప్రస్తుత స‌త్య‌సాయి జిల్లా..............

KGF : ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే.. ఈ రాజకీయ నాయకుడికి బంధువే.. మీకు తెలుసా??

Prashanth Neel

 

Prashanth Neel :  ప్రస్తుతం దేశమంతటా ‘కేజిఎఫ్ 2’ సినిమా పేరు మోత మోగిపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. ‘కేజిఎఫ్ 2’ హీరో యశ్ తో పాటు ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ‘కేజిఎఫ్ 1’ సినిమాతోనే తన సత్తా చూపించాడు. ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’ సినిమాతో మరోసారి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

 

ఒకప్పుడు కన్నడ సినిమాకి 100 కోట్ల సినిమా అంటే కలే. ఇండియాలో అన్ని సినీ పరిశ్రమల కంటే చిన్న పరిశ్రమ కన్నడ సినీ పరిశ్రమే. కానీ ‘కేజిఎఫ్ 1’ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ తలరాత మార్చేశాడు ప్రశాంత్ నీల్. ఈ ఒక్క సినిమాతో కన్నడ పరిశ్రమ ఆకాశాన్నంటింది. ఇప్పుడు ‘కేజిఎఫ్ 2’తో మరింత గుర్తింపు లభించింది. ఇదంతా ప్రశాంత్ నీల్ చలువే.

 

Udayanidhi Stalin : నాకు అసెంబ్లీ ఉందని ఫంక్షన్ డేట్ మార్చారు..

అయితే ప్రశాంత్ నీల్ మన తెలుగువాడే అని తాజాగా తెలిసింది. కర్ణాటకలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీకి చెందిన వాడు ప్రశాంత్ నీల్. అంతే కాక ప్రశాంత్ నీల్ ఆంద్రప్రదేశ్ కి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడి బంధువు కూడా. దీంతో ఈ విషయం తెలిసి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘కేజిఎఫ్ 2’ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రని తెలుగు నటుడు ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం పోషించారు. ఇది ఆయనకి మొదటి సినిమా. ఈ సినిమాతో ఆదర్శ్ కంటే కూడా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు బాలకృష్ణ.

 

Acharya : మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్..

దీంతో ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన బాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంత్ తండ్రి సుభాష్ తనకి బంధువు అని, ప్రస్తుత స‌త్య‌సాయి జిల్లా మ‌డ‌క‌శిర‌లోని నీల‌కంఠాపురంకు చెందిన వారని తెలిపాడు. బెంగుళూరుకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారని, అప్పుడప్పుడు సొంత గ్రామానికి వచ్చి వెళ్తూ ఉంటారని తెలిపారు. అంతే కాక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి ప్ర‌శాంత్ నీల్‌కు అన్నయ్య అవుతారని, ర‌ఘ‌వీరా రెడ్డి తండ్రి, ప్రశాంత్ నీల్ తండ్రి అన్న‌ద‌మ్ములని, వారిద్దరూ కూడా తనకి బంధువులని తెలిపారు. ప్ర‌శాంత్ నీల్ కూడా తన సొంత గ్రామానికి చాలా సార్లు వ‌చ్చేవార‌ని తెలిపారు. ఈ విషయాలు బయటకి తెలియడంతో అంతా సంతోషిస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగు సినిమా అంతటా సత్తా చాటుతుండటంతో మన తెలుగు వాడే కర్ణాటకలో సెటిల్ అయి ‘కేజిఎఫ్’తో మరోసారి సత్తా చాటాడని అంతా ఆనందిస్తూ అభినందనలు తెలియచేస్తున్నారు.