Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం వారికే ఎక్కువగా నచ్చుతుంది – కృతి శెట్టి

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు హీరో నితిన్. తాజాగా ఈ సినిమా హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాలో తన పాత్ర, సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అమ్మడు మీడియాతో పంచుకుంది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం వారికే ఎక్కువగా నచ్చుతుంది – కృతి శెట్టి

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు హీరో నితిన్. ఇక ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం అమెరికా టార్గెట్ ఎంతంటే..?

కాగా, తాజాగా ఈ సినిమా హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించింది. ఈ సినిమాలో తన పాత్ర, సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అమ్మడు మీడియాతో పంచుకుంది. మాచర్ల నియోజకవర్గం సినిమా టీజర్, ట్రైలర్లు చూసి ఈ సినిమా కేవలం మాస్ ఆడియెన్స్ కోసమే అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ సినిమా కథ పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి తీసిందని.. ఖచ్చితంగా వారికి ఈ సినిమా నచ్చుతుందని కృతి చెప్పుకొచ్చింది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్.. డైరెక్ట్ యాక్షనే అంటోన్న నితిన్

అంతేగాక, ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా బాగుంటుందని, రొటీన్ పాత్రలకు భిన్నంగా ఉండటంతో తాను ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లుగా కృతి తెలిపింది. ఈ సినిమాలో నితిన్, కృతి శెట్టిల మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయని అమ్మడు చెబుతోంది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీల్ అవ్వరని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. మరి కృతి శెట్టి చెప్పినట్లుగా ఈ సినిమా నిజంగానే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందా లేదా అనేది ఈ సినిమా రిలీజ్ తరువాతే తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.