Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం అమెరికా టార్గెట్ ఎంతంటే..?

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’పై మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. నితిన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న అమెరికాలోనూ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ మాంచి రేటుకు ముగిసింది. అక్కడ ఈ సినిమాను 400K డాలర్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం అమెరికా టార్గెట్ ఎంతంటే..?

Macherla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’పై మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం రానున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో నితిన్ తొలిసారి కలెక్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం ట్రైలర్.. డైరెక్ట్ యాక్షనే అంటోన్న నితిన్

ఇక ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకు తీసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీ అవుతున్నారు. ముఖ్యంగా నితిన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న అమెరికాలోనూ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ మాంచి రేటుకు ముగిసింది. అక్కడ ఈ సినిమాను 400K డాలర్లకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే.. యూఎస్‌లో మాచర్ల నియోజకవర్గం చిత్రం 400K డాలర్ల టార్గెట్‌తో బరిలోకి దూకనుంది.

Macherla Niyojakavargam: పోలీస్ స్టేషన్‌కు చేరిన ‘మాచర్ల నియోజకవర్గం’!

నితిన్ స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండటంతో, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ పవర్ ప్యాక్డ్‌గా ఉండటంతో ఈ సినిమా అక్కడి ఆడియెన్స్‌ను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తుండగా, మరో బ్యూటీ అంజలి ఓ హాట్ ఐటెం సాంగ్‌లో నటిస్తుంది. ఈ సినిమాను ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి అమెరికాలో మాచర్ల నియోజకవర్గం ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి.