SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఓ వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేసింది.

SSMB28: మహేష్ సినిమాకు ఆ టైటిల్ అయితేనే బెస్ట్ అంటోన్న ఫ్యాన్స్!

Fans Want That Title For SSMB28 Movie

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చిత్ర యూనిట్ ఓ వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేసింది.

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా మేకింగ్‌కు సంబంధించి ఓ వీడియోను ‘SSMB28 ఆరంభం’ అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ వీడియో అభిమానులకు తెగ నచ్చేయడంతో, ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విషయంలోనూ ఫ్యాన్స్ ఓ ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకు ‘ఆరంభం’ అనే టైటిల్ పెడితేనే బాగుంటుందని వారు అంటున్నారు. త్రివిక్రమ్‌కు ఇంగ్లీష్‌లో ‘A’ అనే అక్షరంతో వచ్చే టైటిల్స్ బాగా కలిసొస్తాయని.. అందుకే మహేష్ తాజా చిత్రానికి కూడా ఆరంభం అనే టైటిల్ సూపర్బ్‌గా ఉంటుందని వారు డిమాండ్ చేస్తున్నారు.

SSMB28: మహేష్ మూవీలో మలయాళ నటుడు.. ఎవరంటే..?

ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని వారు అప్పుడే ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారో చూడాలి.