SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని నేడు(సోమవారం) మొదలుపెట్టారు మూవీ మేకర్స్. ఈరోజు ఉదయం షూటింగ్ మొదలయింది అంటూ.. త్రివిక్రమ్, మహేష్ కి సీన్ వివరిస్తున్న ఓ ఫోటోని షేర్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా "SSMB28 ఆరంభం" అంటూ..

SSMB28: మహేష్ త్రివిక్రమ్‌ల “SSMB28” రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ మేకర్స్!

Mahesh SSMB28 Release Date Fix

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. గతంలో వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ప్రజాధారణ పొందడంతో, ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని నేడు(సోమవారం) మొదలుపెట్టారు మూవీ మేకర్స్.

Mahesh Babu Rajamouli: జక్కన్నతో మహేష్ ఆట మొదలుపెట్టేది అప్పుడే..?

ఈరోజు ఉదయం షూటింగ్ మొదలయింది అంటూ.. త్రివిక్రమ్, మహేష్ కి సీన్ వివరిస్తున్న ఓ ఫోటోని షేర్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా “SSMB28 ఆరంభం” అంటూ ఒక వీడియోని విడుదల చేయడమే కాకుండా సినిమా రిలీజ్ డేట్ ని కూడా మూవీ మేకర్స్ ఆ వీడియోలో ప్రకటించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకోబోతున్న ఈ మూవీ, వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రాబోతున్నట్టు వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపించనుండగా, అతనకు జంటగా పూజ హెగ్దే నటిస్తుంది. భీమ్లా నాయక్ ఫేమ్ ‘సంయుక్త మీనన్’ ఒక ముఖ్య పాత్రలో మెరవనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకుంటారని, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.