Mahesh Babu Rajamouli: జక్కన్నతో మహేష్ ఆట మొదలుపెట్టేది అప్పుడే..?

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బాక్సాఫీస్‌ను మరోసారి చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించిన జక్కన్న, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు మేటి స్టార్స్‌ను ఆయన డీల్ చేసిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కాగా, ఈ డైరెక్టర్‌తో కెరీర్‌లో తొలిసారి పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నాడు.

Mahesh Babu Rajamouli: జక్కన్నతో మహేష్ ఆట మొదలుపెట్టేది అప్పుడే..?

Mahesh Babu Rajamouli Movie To Start From This Date

Mahesh Babu Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బాక్సాఫీస్‌ను మరోసారి చెడుగుడు ఆడేసుకున్నాడు. ఈ సినిమాను మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కించిన జక్కన్న, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు మేటి స్టార్స్‌ను ఆయన డీల్ చేసిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కాగా, ఈ డైరెక్టర్‌తో కెరీర్‌లో తొలిసారి పనిచేసేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రెడీ అవుతున్నాడు.

SSMB29: మహేష్‌తో సినిమా గురించి జక్కన్న కామెంట్స్!

మహేష్-రాజమౌళి కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరనుందని జక్కన్న స్వయంగా ప్రకటించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో పట్టాలెక్కనున్నట్లు జక్కన్న తెలిపాడు. కాగా అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడని.. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ స్క్రిప్టును లాక్ చేసి, జనవరి 26న ఈ సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?

ఇక ఈ సినిమాతో మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని పాత్రను చేయబోతున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పవర్‌ఫుల్ కథను రెడీ చేయగా, ఈ సినిమాను కెఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.