SSMB29: మహేష్‌తో సినిమా గురించి జక్కన్న కామెంట్స్!

ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆర్ఆర్ఆర్. సినిమా ఎప్పుడొస్తుందా ఎన్టీఆర్-చరణ్ లను ఒకే తెరపై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించిన..

SSMB29: మహేష్‌తో సినిమా గురించి జక్కన్న కామెంట్స్!

Ssmb29

SSMB29: ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట ఆర్ఆర్ఆర్. సినిమా ఎప్పుడొస్తుందా ఎన్టీఆర్-చరణ్ లను ఒకే తెరపై ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించిన ట్రైలర్.. ఇద్దరు స్టార్ కలిసి చేసిన నాటు డాన్స్ వీడియోలు సినిమా మీద మరిన్ని ఆశలు పెంచేస్తే .. మరోవైపు దేశవ్యాప్తంగా మేకర్స్ మొదలు పెట్టిన ప్రచారం మరింత హైప్స్ పెంచేస్తుంది. దర్శక, నిర్మాతలు రాజమౌళి-దానయ్య దగ్గర నుండి ఎన్టీఆర్-చరణ్-అలియా సహా అంతా కలిసి మూకుమ్మడిగా అన్నిబాషలలో ప్రచారం హోరెత్తిస్తున్నారు.

Pushpa-1: రాసిపెట్టుకోండి పుష్ప బ్లాక్ బస్టర్.. మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్!

ట్రైలర్ లాంచింగ్ అనంతరం ముంబై నుండి హైదరాబాద్ వరకు మధ్యలో బెంగళూరులో కూడా యూనిట్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఇక, హైదరాబాద్ ఈవెంట్ లో అయితే దాదాపు గంటసేపు యూనిట్ మీడియాతో ముచ్చటించింది. దీంతో సహజంగానే జక్కన్న తర్వాత సినిమా ప్రస్తావన వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత జక్కన చేయబోయే సినిమా మహేష్ బాబుతోనే. ఇప్పటికే ఇరు వర్గాలు దీనిని ధృవీకరించగా రాజమౌళి తండ్రి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాడు.

Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్… బయటకు వెళ్లేది ఈమేనా?

కాగా, ఆర్ఆర్ఆర్ మీడియా ఇంటరాక్షన్ లో రాజమౌళికి మహేష్ తో సినిమాపై ప్రశ్న ఎదురు కాగా మహేష్ బాబుతో సినిమాని కన్ఫర్మ్ చేస్తూనే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం సరికాదని ఈ సినిమా విడుదల అనంతరం ఆ సినిమా గురించి మాట్లాడుకుందామని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. అయితే.. జస్ట్ రాజమౌళి ఈ సినిమాపై స్పందిస్తేనే మహేష్ 29వ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్యాగ్ ఇండియన్ వైడ్ ట్రెండ్ స్టార్ అయిందంటే ఈ సినిమా మొదలు కాకుండానే ఏ రేంజ్ అంచనాలున్నాయో తెలుసుకోవచ్చు.