Pushpa-1: రాసిపెట్టుకోండి పుష్ప బ్లాక్ బస్టర్.. మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్!

పార్టులుగా చేస్తున్న సినిమా.. మూడోసారి తెరకెక్కబోతున్న హిట్ కాంబినేషన్.. 3 వేల ధియేటర్లలో సినిమా రిలీజ్.. ఓవరాల్ గా బొమ్మ బావుందంటున్నారు మేకర్స్. నెవర్ బిఫోర్ లుక్ లో..

Pushpa-1: రాసిపెట్టుకోండి పుష్ప బ్లాక్ బస్టర్.. మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్!

Pushpa

Pushpa-1: 2 పార్టులుగా చేస్తున్న సినిమా.. మూడోసారి తెరకెక్కబోతున్న హిట్ కాంబినేషన్.. 3 వేల ధియేటర్లలో సినిమా రిలీజ్.. ఓవరాల్ గా బొమ్మ బావుందంటున్నారు మేకర్స్. నెవర్ బిఫోర్ లుక్ లో అంతకు మించిన ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా గురించి టెన్షన్ పడుతున్నారా? హిట్టవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారా? అసలు పుష్ప టీమ్ ఏమనుకుంటోంది? ఎక్కడ విన్నా ఇప్పుడు ఇదే చర్చ.

Bigg Boss 5: ఈ వారం లాస్ట్ ఎలిమినేషన్.. అయ్యే కంటెస్టెంట్ ఈమేనా?

పుష్ప దూకుడు పెంచాడు.. పుష్పరాజ్ అసలు తగ్గేదే లేదంటున్నాడు. నెక్ట్స్ వీక్ రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప మూవీకి సంబందించి ప్రమోషన్లు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పుష్పటీమ్.. ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప గ్యారంటీగా హిట్టే అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్.

Ali Akbar: ఇకపై నేను ముస్లిం కాదు ఇండియన్.. మలయాళ ఫిల్మ్ డైరెక్టర్!

పుష్ప టీమ్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బన్నీ కెరీర్ లోనేఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవల్లో వరల్డ్ వైడ్ గా మూడు వేల ధియేటర్లకు పైగా పుష్పని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టీమ్. రేర్ గా దొరికే ఇలాంటి కథలకు బన్నీ కంప్లీట్ గా న్యాయం చేశారని, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ రేసింగ్ లా ఉంటుందని సినిమా మీద ఇంకాస్త హైప్స్ పెంచేశారు. సినిమాల విషయంలో ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా, స్టైలిష్ స్టార్ అన్న పేరు మర్చిపోయే గెటప్ లో ఊరమాస్ క్యారెక్టర్ లో పుష్పరాజ్ గా నెవర్ బిఫోర్ లుక్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

Vikki-Katrina : విక్కీ కత్రినా హల్దీ వేడుక ఫోటోలు

బన్నీ ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా.. పుష్ప మాత్రం వాటన్నింటినీ మించి ఉండబోతోందని, బన్నీ కెరీర్ లో సూపర్ హిట్ గ్యారంటీ అంటున్నారు టీమ్. అంతేకాదు.. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లు, పాటలు సినిమా మీద ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. వాటితో పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన సమంత పాటతో సినిమా క్రేజ్ పీక్స్ కి వెళ్లిపోయింది. ఇన్ని ఎట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టే సినిమా మీద ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు పుష్ప టీమ్.