Ali Akbar: ఇకపై నేను ముస్లిం కాదు ఇండియన్.. మలయాళ ఫిల్మ్ డైరెక్టర్!

చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అక్బ‌ర్ మలయాళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు పనిచేశాడు. డజనుకుగా పైగా సినిమాలకు రచయితగా పనిచేసిన అలీ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. 1921లో జ‌రిగిన మ‌లాబార్..

Ali Akbar: ఇకపై నేను ముస్లిం కాదు ఇండియన్.. మలయాళ ఫిల్మ్ డైరెక్టర్!

Ali Akbar

Ali Akbar: చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అక్బ‌ర్ మలయాళంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు పనిచేశాడు. డజనుకుగా పైగా సినిమాలకు రచయితగా పనిచేసిన అలీ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. 1921లో జ‌రిగిన మ‌లాబార్ ఉద్య‌మంపై ప్రస్తుతం సినిమాను తీస్తున్నారు. స్వతహాగా ముస్లిం కుటుంబంలో జన్మించిన అలీ ఇప్పుడు క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. ఇస్లాం మ‌తాన్ని త్య‌జిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ మృతిపై కొంద‌రు అనుచిత కామెంట్లకు వ్య‌తిరేకంగా తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు.

Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

బిపిన్ మృతిపై కూడా కొందరు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని.. దానికి ఆయన తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలీతో పాటు త‌న భార్య కూడా ఇస్లామ్ మ‌తాన్ని వ‌దిలివేస్తున్న‌ట్లు ఆయన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇకపై తాను నేను ముస్లింను కాదాని.. నేను ఇండియ‌న్‌ను మాత్రమే అంటూ అక్బ‌ర్ త‌న వీడియోలో చెప్పాడు. అలీ ఇస్లాం మతానికి గుడ్ బై చెప్పడంపై కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ఆర్మీ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలవరపరిచింది. దేశాన్ని కాపాడే త్రివిధ దళాలకు అధిపతితో పాటు ఆయన కుటుంబం.. మరికొందరు జవాన్లు మృతి చెందడం భారత ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే ఆయ‌న మృతి ప‌ట్ల సోష‌ల్ మీడియాలో మరో ప్ర‌చారం కూడా సాగుతోంది. కొంద‌రు బిపిన్ నివాళిగా స్మైలీ ఎమోజీల‌ను పోస్టు చేస్తూ విద్వేషాన్ని చిమ్ముతున్నారు. మైనార్టీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ఇలా చేస్తున్న‌ట్లు ఆరోపిస్తున్న అలీ ఇలాంటి జాతి వ్య‌తిరేకుల‌ను తాను స‌హించబోన‌ని అందుకే ఇస్లాం మతాన్ని వదిలేసినట్లు చెప్పారు.