Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు.

Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి

Rawat Funerals

CDS Bipin Rawat and his wife funerals : ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. సీడీఎస్ రావత్ కు ఆర్మీ 17 గన్ సెల్యూట్ చేసింది. ఫ్రంట్ ఎస్కార్ట్ గా 120 మంది త్రివిధ దళ సభ్యులు వ్యవహరించారు. 800 మంది సర్వీస్ మెన్ అంత్యక్రియలో పాల్గొన్నారు. సీడీఎస్ రావత్ కు ఆర్మీ గౌరవ వీడ్కోలు పలికింది. రావత్ అంత్యక్రియలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లు, సైనిక ఉన్నతాధికారులు, ఉత్తరాఖండ్, ఢిల్లీ సీఎంలు హాజరయ్యారు. అలాగే ఫ్రెంచ్ అంబాసిడర్, బ్రిటీష్ హై కమిషనర్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మిలటరీ కమాండర్లు..రావత్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

అంతకముందు కామ్ రాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. రెండు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా ప్రజలు రావత్ కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలికరావత్‌కు ప్రతీ భారతీయుడు కన్నీటితో వీడ్కోలు పలికాడు.

Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

ఉదయం ఆర్మీ ఆస్పత్రి నుంచి రావత్ దంపతుల భౌతికకాయాలను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచారు. రావత్ దంపతులకు రావత్ దంపతుల భౌతికకాయాలకు ఆర్మీ, రాజకీయ, న్యాయ ప్రముఖులు నివాళులర్పించారు. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు రావత్‌ దంపతుల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. భుటాన్‌, శ్రీలంక, నేపాల్‌ సైనిక ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు.

తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం(డిసెంబర్8, 2021) మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్​ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులతో సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే. భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17-వి5 రకం హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ఘటనలో బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులికతో పాటు మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హెలికాప్టర్ లో మొత్తం 14మంది ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.