Cocoons : ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి..
కుకూన్స్ ఫస్ట్ లుక్ ను దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా విడుదల చేశారు.
Director Anil Ravipudi released Cocoons first look poster
Cocoons : జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కుకూన్స్’. న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మాణంలో డైరెక్టర్ మహేశ్ గౌరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా కుకూన్స్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కుకూన్స్ పోస్టర్ కొత్తగా ఉంది. మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్ లో తెలుస్తున్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్ గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా టీమ్ అందరికి అల్ ది బెస్ట్ అని అన్నారు.
Sravya Dimple : తెల్లకాగితం వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన శ్రావ్య డింపుల్.. ఫోటోలు వైరల్..
View this post on Instagram
