Keeravani : ఇప్పటి సింగర్స్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి ఫేవరేట్ సింగర్స్ ఎవరో తెలుసా?

ఇంట‌ర్వూలో కీర‌వాణి వీరిద్దర్నీ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగానే సీనియర్ సింగర్స్ కాకుండా ఇప్పటి యంగ్ సింగర్స్ లో మీకు బాగా నచ్చిన సింగర్స్ ఎవరు అని అడిగారు కీరవాణి..

Keeravani : ఇప్పటి సింగర్స్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లకి ఫేవరేట్ సింగర్స్ ఎవరో తెలుసా?

Ntr Ram Charan

 

NTR – Ram Charan :  రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను సంగీత దర్శకుడు కీరవాణి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంట‌ర్వూలో కీర‌వాణి వీరిద్దర్నీ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగానే సీనియర్ సింగర్స్ కాకుండా ఇప్పటి యంగ్ సింగర్స్ లో మీకు బాగా నచ్చిన సింగర్స్ ఎవరు అని అడిగారు కీరవాణి. ఇందుకు సమాధానంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”అర‌వింద స‌మేత‌ సినిమాలో ‘రెడ్డ‌మ్మతల్లి’ పాట పాడిన‌ మోహ‌నభోగ‌రాజు గారు, ‘అఖండ’ సినిమాలో ‘జై బాల‌య్య’ పాడిన గీతామాధురి గారి వాయిస్ లు బాగుంటాయి. వారి పాటలు బాగుంటాయి. వాళ్లిద్దరూ ఇష్టమైన సింగర్స్” అని తెలిపారు.

RRR: ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ ఫైట్.. వెనక ఇంత పెద్ద కథ నడిచిందా?!

ఇక చరణ్ మాట్లాడుతూ.. ”బుల్లెట్ బండి పాట పాడిన‌ మొహ‌న‌భోగ‌రాజు గారు, ‘సారంగ‌ద‌రియా’ పాడిన మంగ్లీ గారి వాయిస్ లు బాగుంటాయి. వారిద్దరూ ఫేవ‌రెట్ సింగ‌ర్స్” అని తెలిపారు. దీంతో వీరు మాట్లాడిన ఈ మాటలని షేర్ చేసి మోహన్ భోగరాజు, గీతా మాధురి, మంగ్లీలు థ్యాంక్స్ చెప్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.