The Ghost Movie: ‘వేగం’గా దూసుకొస్తున్న ది ఘోస్ట్ రొమాంటిక్ సాంగ్!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

The Ghost Movie: ‘వేగం’గా దూసుకొస్తున్న ది ఘోస్ట్ రొమాంటిక్ సాంగ్!

First Single Song From The Ghost Movie Locks Date

The Ghost Movie: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతకొంత కాలంగా నాగ్‌కు సరైన హిట్ లేకపోవడంతో, ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.

The Ghost Movie: ఆరు నూరైనా.. అదే రోజు దిగుతానంటోన్న ‘ది ఘోస్ట్’!

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న ది ఘోస్ట్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. వేగం అంటూ సాగే రొమాంటిక్ సింగిల్ సాంగ్‌ను సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తున్నట్లు ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా ది ఘోస్ట్ చిత్ర యూనిట్ వెల్లడించింది.

The Ghost Trailer: ది ఘెస్ట్ ట్రైలర్.. యాక్షన్‌తో చించేసిన నాగ్!

ఈ సినిమాలో నాగార్జున సరసన అందాల భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు భరత్ సౌరభ్ సంగీతం అందిస్తుండగా, మార్క్ కె రాబిన్ బీజీఎం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.