Chiranjeevi-Nagarjuna: బాలీవుడ్ రిలీజ్ కి చిరు “నో”, నాగార్జున “యస్”..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. అదే రోజు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ఏ సినిమా హిట్ అవుతుందో అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Chiranjeevi-Nagarjuna: బాలీవుడ్ రిలీజ్ కి చిరు “నో”, నాగార్జున “యస్”..

For Bollywood Release Chiranjeevi Said No Nagarjuna Said Yes

Chiranjeevi-Nagarjuna: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. అదే రోజు నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నందున, ఏ సినిమా హిట్ అవుతుందో అని ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Nagarjuna: రీమేక్స్ చేయడం ఆపేయండి.. చిరు, పవన్ లకు నాగార్జున సలహా!

ఇదిలా ఉంటే ఈ సినిమాలను బాలీవుడ్‌లో విడుదల చేయాలని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తే బజ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో డీల్ కోసం మెగాస్టార్‌ని సంప్రదించగా.. నో చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా తెలుగులో విడుదల చేసిన తర్వాత బాలీవుడ్ గురించి ఆలోచిస్తానని మెగాస్టార్ అన్నారట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు సైలెంట్ అయిపోయారు.

అలాగే నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేసేందుకు కొందరు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ ఇచ్చారట. దీనికి మూవీ టీమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నాగ్ అతిథి పాత్రలో కనిపించాడు. కాబట్టి ‘ది ఘోస్ట్’ సినిమాపై మంచి బజ్ ఉంటుందని నమ్ముతున్నారు. మరి చూడాలి బాలీవుడ్ రిలీజ్ కి ‘నో’ చెప్పిన చిరంజీవి కరెక్ట్? ‘యస్’ చెప్పిన నాగార్జున కరెక్ట్?