Nagarjuna: రీమేక్స్ చేయడం ఆపేయండి.. చిరు, పవన్ లకు నాగార్జున సలహా!

టాలీవుడ్ మన్మధుడు 'కింగ్ నాగార్జున' నటిస్తున్న తాజా చిత్రం "ది ఘోస్ట్". యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే విలేకర్ల సమావేశంలో ఒక విలేకరు రీమేక్స్ గురించి నాగ్ ని ప్రశ్నించగా..

Nagarjuna: రీమేక్స్ చేయడం ఆపేయండి.. చిరు, పవన్ లకు నాగార్జున సలహా!

Nagarjuna Comments on Remaking of Films

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు ‘కింగ్ నాగార్జున’ నటిస్తున్న తాజా చిత్రం “ది ఘోస్ట్”. యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘చందమామ కథలు’, ‘పి.స్.వి గరుడవేగ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ్, ఈ సినిమాలో నాగ్ ని ‘రా ఏజెంట్’గా చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అండ్ టీజర్స్ మూవీపై మంచి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి.

The Ghost Trailer: ది ఘెస్ట్ ట్రైలర్.. యాక్షన్‌తో చించేసిన నాగ్!

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే విలేకర్ల సమావేశంలో ఒక విలేకరు రీమేక్స్ గురించి నాగ్ ని ప్రశ్నించగా.. “రీమేక్స్ చేయడం ఆపేస్తే బెటర్” అంటూ నాగార్జున తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

“ఓటిటి ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చాక ప్రేక్షకులు అన్ని భాషలోని సినిమాలని చూడడం మొదలుపెట్టారు. దాంతో ప్రేక్షకుడు సినిమా సినిమాకి కంపారిజన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ కంపారిజన్ మొదలుకావడంతో ప్రేక్షకుల్లో ఆల్రెడీ చూసిన సినిమాని చూడడం ఎందుకులే అనే భావన కలుగుతుంది. అందుకనే నేను రీమేక్స్ చేయదల్చుకోలా, అలాగే మనవాళ్ళు కూడా ఇది గమనించి రీమేకులు చేయడం ఆపేస్తే బెటర్” అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం పవన్ ఒక రీమేక్, చిరు రెండు రీమేక్స్ చేస్తున్న విషయం తెలిసిందే.