Godfather: గాడ్‌ఫాదర్ క్లారిటీ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని.. అందుకే ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయడం లేదనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపించింది.

Godfather: గాడ్‌ఫాదర్ క్లారిటీ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట!

Godfather Team Slams The Postponement Rumours

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తుండటంతో మెగా అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు. ఇక ఈ సినిమాను మలయాళ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా రిలీజ్ విషయంలో గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Godfather: గాడ్‌ఫాదర్ కోసం వీరమల్లు.. అభిమానులు గెట్ రెడీ!

గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని.. అందుకే ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేయడం లేదనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా వినిపించింది. అయితే ఈ సినిమా రిలీజ్‌పై వస్తున్న వార్తలను చిత్ర నిర్మాత ఎన్వీ.ప్రసాద్ తాజాగా ఖండించారు. గాడ్‌ఫాదర్ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు సజావుగా సాగుతున్నాయని.. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందని ఆయన తెలిపారు.

Godfather To Give A Mega Treat: మెగా ట్రీట్‌ను రెడీ చేస్తోన్న గాడ్‌ఫాదర్..?

కాగా, ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందనే పుకారులో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా రాబోతుందని, ఈ సినిమాతో టాలీవుడ్‌లో అసలైన పండగ వాతావరణం నెలకొనడం ఖాయమని ఆయన అన్నారు. దీంతో గాడ్‌ఫాదర్ చిత్ర రిలీజ్ వాయిదా వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.