Hanuman : రాముడి జన్మస్థలంలో హనుమాన్ టీమ్ సందడి..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో మూవీ 'హనుమాన్'. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాయి. తాజాగా..

Hanuman : రాముడి జన్మస్థలంలో హనుమాన్ టీమ్ సందడి..

Hanuman movie team in Ayodhya

Hanuman : తన టాలెంట్ తో తెలుగులో అతి తక్కువ సమయంలో గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు ‘ప్రశాంత్ వర్మ’. మొదటి సినిమా నుంచి వైవిధ్యాన్ని చూపిస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ యువహీరో ‘తేజ సజ్జ’తో తెరకెక్కించిన సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. భారతీయ ఇతిహాసాల్లో రామభక్తుడిగా అందరికి తెలిసిన హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది తన సినిమాతో చెప్పబోతున్నాడు.

Hanuman Vs Adipurush : హనుమాన్ వర్సెస్ ఆదిపురుష్.. హనుమాన్ టీజర్ రాకతో ఓంరౌత్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాయి. వందల కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలో కూడా చూపించనంత క్వాలిటీగా.. తక్కువ ఖర్చుతూ, చాలా ఎఫెక్టివ్ గా చూపించడంతో సినీ లవర్స్ హనుమాన్ టీజర్ కి ఫిదా అయ్యిపోయారు. ఇక టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీలో ఉంది. ఈ క్రమంలోనే రాముడి జన్మస్థలం అయిన అయోధలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సినిమా విడుదల తేదిని ప్రకటించనప్పటికీ మూవీ టీమ్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది. వాటిని అయోధ్య నుంచే మొదలుపెట్టారు. కాగా ఈ సినిమాను కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపిస్తున్నాడు. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.