Hanuman Vs Adipurush : హనుమాన్ వర్సెస్ ఆదిపురుష్.. హనుమాన్ టీజర్ రాకతో ఓంరౌత్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

 కొన్ని రోజుల క్రితం ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రామాయణం, ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు.............

Hanuman Vs Adipurush : హనుమాన్ వర్సెస్ ఆదిపురుష్.. హనుమాన్ టీజర్ రాకతో ఓంరౌత్ ని ఆడేసుకుంటున్న నెటిజన్లు..

Netizens trolling Director om raut with comparing adipurush teaser and hanuman teaser

Updated On : November 22, 2022 / 11:10 AM IST

Hanuman Vs Adipurush :  కొన్ని రోజుల క్రితం ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రామాయణం, ప్రభాస్ రాముడు అనగానే ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత బొమ్మల సినిమా అని, రామాయణాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అస్సలు బాగోలేవు అని విమర్శించారు.

అయితే తాజాగా తేజ సజ్జ హీరోగా సరికొత్త సినిమాలతో కథలు తీసే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో గ్రాఫిక్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హనుమాన్ ని దేవుడిలాగే అందరూ ఊహించే శక్తివంతుడిలాగే చూపెట్టారు. ఈ టీజర్ లో చూసిన విజువల్స్ కి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా బడ్జెట్ కేవలం 25 కోట్లే.

Hanuman Teaser Launch Event : హనుమాన్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ

దీంతో అందరూ ఓం రౌత్ ని విమర్శించడం మొదలుపెట్టారు. 25 కోట్లతో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ ఇస్తుంటే నువ్వేమో 500 కోట్లు అని చెప్పి కార్టూన్ సినిమా చుపిస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దేవుడ్ని ఎలా చూపించాలో హనుమాన్ టీజర్ చూసి నేర్చుకో అంటూ ఓం రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు. హనుమాన్ టీజర్ ఆదిపురుష్ టీజర్ కంటే 100 రెట్లు బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. అన్ని సోషల్ మీడియాలలో నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు కూడా ఓంరౌత్ ని ఆడేసుకుంటున్నారు. ట్విట్టర్లో ఆదిపురుష్, హనుమాన్, ఓం రౌత్ ట్రెండింగ్ లో ఉన్నారు ప్రస్తుతం. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే హనుమాన్ టీజర్ ని ఓంరౌత్ కి ట్యాగ్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో హనుమాన్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ కూడా బాగానే వస్తుంది. టీజర్ తో మెప్పించిన హనుమాన్ మరి సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి.