Hari Hara Veera Mallu Update: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పూనకాలు తెప్పించే అప్డేట్ రానుంది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లుగా ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడీ డైరెక్షన్‌లో పవన్ తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉండటంతో, ఆ రోజున హరిహర వీరమల్లు నుండి బిగ్గెస్ట్ అప్డేట్ రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Hari Hara Veera Mallu Update: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పూనకాలు తెప్పించే అప్డేట్ రానుంది..?

Hari Hara Veera Mallu Update On Pawan Kalyan Birthday

Hari Hara Veera Mallu Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ త్వరలోనే రానున్నట్లుగా ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడీ డైరెక్షన్‌లో పవన్ తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ ఫిక్షన్ కథగా రానున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Hari Hara Veeramallu: చెమటోడుస్తున్న పవన్.. రిస్కీ షాట్స్ చేయబోతున్నాడా?

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో, హరిహర వీరమల్లు చిత్రం నుండి ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆశగా చూస్తున్నారు. అయితే వారి ఆశలు తీరే సమయం దగ్గరపడినట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉండటంతో, ఆ రోజున హరిహర వీరమల్లు నుండి బిగ్గెస్ట్ అప్డేట్ రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ కూడా లైన్‌లో ఉన్నాడా..?

అయితే అది ఖచ్చితంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర అయ్యి ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉండబోతుందో ఇప్పటికే రివీల్ చేశారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నిర్మాత ఇటీవల క్లారిటీ కూడీ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని 2023 మార్చి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపాడు. మరి పవన్ బర్త్ డే ట్రీట్‌గా వీరమల్లు నుండి నిజంగా బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ రాబోతుందా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.