Hari Hara Veeramallu: చెమటోడుస్తున్న పవన్.. రిస్కీ షాట్స్ చేయబోతున్నాడా?

ఈ మధ్య ఫిజికల్ రిస్క్ లేని రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు బాడీకి ఫుల్ గా పని చెప్పి చెమటోడుస్తున్నారు. ఆ మూవీ.. ఈ రీమేక్ అంటూ ప్రచారం ..

Hari Hara Veeramallu: చెమటోడుస్తున్న పవన్.. రిస్కీ షాట్స్ చేయబోతున్నాడా?

Hari Hara Veeramallu

Hari Hara Veeramallu: ఈ మధ్య ఫిజికల్ రిస్క్ లేని రీమేక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు బాడీకి ఫుల్ గా పని చెప్పి చెమటోడుస్తున్నారు. ఆ మూవీ.. ఈ రీమేక్ అంటూ ప్రచారం జరిగినా.. ముందు క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయిన వీరమల్లు.. ఆ సినిమా కోసం రిస్కీ షాట్స్ చేయబోతున్నారా..?

Hari Hara Veera Mallu : ఫ్యాన్స్ ఫుల్ ఖుష్.. రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు..

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారు. విల్లు పట్టి స్టంట్స్ చేసేందుకు మళ్లీ కసరత్తులు షురూ చేశారు. గత షెడ్యూల్స్ లో హరిహర వీరమల్లు కోసం రిస్కీ షాట్స్ షూట్ లో పాల్గొన్న పవన్.. మళ్లీ ఇప్పుడు యాక్షన్ సీన్స్ చేసేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టోడోర్ లాజరోవ్ పర్యవేక్షణలో పవర్ స్టార్ ప్రాక్టీస్ ఇప్పుడు ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తోంది. లాస్ట్ రీమేక్స్ లో మిస్ అయిన హై ఎండ్ ఎనర్జీని త్వరలో చూడబోతున్నామంటూ మురిసిపోతున్నారు పవన్ ఫ్యాన్స్.

Hari Hara Veera Mallu : పవన్ పక్కన ‘పంచమి’ గా నిధి అగర్వాల్..

ఈ ఇయర్ భీమ్లానాయక్.. లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్.. రెండూ రీమేక్లే.. రెండూ సూపర్ హిట్లే. కానీ కథే హీరోని నడిపించిన ఈ మూవీల్లో పవన్ కి పెద్ద రిస్క్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ తగలలేదు. అందులోనూ భీమ్లానాయక్ ఫైట్ ను డూప్ తో నడిపించారనే టాక్ ఉంది. కానీ క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు స్టోరీ.. 17వ శతాబ్ధం నాటి మొఘలాయి-కుతుబ్ షాహిల కాలం నాటిది. ఇందులో రాబిన్ హుడ్ లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు పవర్ స్టార్. స్వతహాగా రిస్కీ మూమెంట్స్ ను ఇష్టపడే పవన్.. తానే సొంతంగా అన్ని ఎపిసోడ్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Pawan kalyan : ‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీన్స్ పై అప్‌డేట్

ఏప్రిల్ 8 నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ రీస్టార్ట్ కాబోతుంది. సెట్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక మొత్తంగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను 50 శాతం పైగా కంప్లీట్ చేశాడు క్రిష్. ఇంకా మేజర్ షూట్ బాకీ ఉంది. జూలై వరకు రెగ్యులర్ షూట్ చేసి సినిమాను పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. పవన్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బరిలో దిగుతున్నారు. ఆ తర్వాతే మిగిలిన ప్రాజెక్ట్స్ జోలికి వెళ్లాలనుకుంటున్నారు.