Hari Hara Veera Mallu : పవన్ పక్కన ‘పంచమి’ గా నిధి అగర్వాల్..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నిధి అగర్వాల్, ‘పంచమి’ అనే క్యారెక్టర్లో కనిపించనుందని పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్..

Hari Hara Veera Mallu : పవన్ పక్కన ‘పంచమి’ గా నిధి అగర్వాల్..

Nidhhi Agerwal

Updated On : August 17, 2021 / 1:56 PM IST

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో.. ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ.. ‘హరి హర వీరమల్లు’.. (Legendary Heroic Outlaw).. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Hari Hara Veera Mallu

 

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పవన్ పక్కన కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 17 నిధి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతూ.. ఈ మూవీలో నిధి, ‘పంచమి’ అనే క్యారెక్టర్లో కనిపించనుందని పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. ట్రెడిషనల్ వేర్‌లో నాట్యం చేస్తున్న నిధి లుక్ ఆకట్టుకుంటోంది.

కెరీర్ పరంగా ‘హరి హర వీరమల్లు’.. నిధికి బిగ్ బ్రేక్ అనే చెప్పాలి. ఆమె స్టార్ హీరోతో నటించడం ఇదే ఫస్ట్ టైమ్. 2022 సంక్రాంతికి పవన్ ‘హరి హర వీరమల్లు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఇంతకుముందు ప్రకటించారు. అయితే రీసెంట్‌గా ‘భీమ్లా నాయక్’ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. దీంతో ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారే అవకాశముంది.

Pawan Kalyan : క్లీన్ స్మాష్.. ‘భీమ్లా నాయక్’ ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్..

ఈ సినిమాకి మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్, సంగీతం : ఎం.ఎం.కీరవాణి, కెమెరా : జ్ఞానశేఖర్, ఎడిటింగ్ : శ్రవణ్, పోరాటాలు : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.

Nidhhi Agerwal