Namita : త్వరలో రాజకీయాల్లోకి వస్తాను.. సినిమాల కంటే పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ..

శ్రీవారి దర్శనం అయిన తరువాత నమిత మీడియాతో మాట్లాడింది. నమిత మాట్లాడుతూ.. ''నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు చాలా బాగున్నారు. అందుకే స్వామివారికి థ్యాంక్స్ చెప్దామని నేను, నా భర్త...............

Namita : త్వరలో రాజకీయాల్లోకి వస్తాను.. సినిమాల కంటే పాలిటిక్స్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ..

Heroine Namita entry in politics very soon

Namita :  సినిమా వాళ్ళు పాలిటిక్స్ లోకి రావడం కొత్తేమి కాదు ఈ లిస్ట్ లో మరో హీరోయిన్ చేరబోతోంది. సింహమంటి చిన్నోడే.. అంటూ ఆడిపాడిన నమిత తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలు చేసింది. కొన్నేళ్ల క్రితం సినిమాలకి దూరమయి పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ తో హ్యాపీగా గడుపుతుంది. ఇటీవలే నమితకి కవల పిల్లలు పుట్టారు. తాజాగా నమిత తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చింది.

శ్రీవారి దర్శనం అయిన తరువాత నమిత మీడియాతో మాట్లాడింది. నమిత మాట్లాడుతూ.. ”నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళు చాలా బాగున్నారు. అందుకే స్వామివారికి థ్యాంక్స్ చెప్దామని నేను, నా భర్త, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వచ్చాము. సినిమాలు చేస్తానో చేయనో చెప్పలేను. కానీ సినిమాల మీద కంటే పాలిటిక్స్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాను” అని చెప్పింది.

RJ Surya : మీమ్స్ చేసేవాళ్ళు వంద చేస్తారు.. నేనెవరితో క్లోజ్ గా ఉంటే వాళ్ళతో.. మీమర్స్ ని గెలికిన ఆర్జే సూర్య..

దీంతో నమిత చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చగా మారాయి. నమిత ఏ పార్టీలో చేరుతుందో, ఏ పార్టీ వాళ్ళు తనని కాకా పట్టి జాయిన్ చేసుకుంటారో అని తమిళ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నమిత పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అని తమిళ మీడియా అంటుంది.