RJ Surya : మీమ్స్ చేసేవాళ్ళు వంద చేస్తారు.. నేనెవరితో క్లోజ్ గా ఉంటే వాళ్ళతో.. మీమర్స్ ని గెలికిన ఆర్జే సూర్య..

సూర్య ఇనయాను మోటివేట్‌ చేయడానికి తనతో ఎక్కువగా ఉన్నాను, తనతో మాట్లాడాను అని చెప్పాడు. అంతకుముందు ఆరోహితో కూడా క్లోజ్ గా ఉన్నావు కదా అని...........

RJ Surya : మీమ్స్ చేసేవాళ్ళు వంద చేస్తారు.. నేనెవరితో క్లోజ్ గా ఉంటే వాళ్ళతో.. మీమర్స్ ని గెలికిన ఆర్జే సూర్య..

RJ Surya comments on memers

RJ Surya :  బిగ్‌బాస్ నుండి ఈ వారం శనివారమే ఆర్జే సూర్య ఎలిమినేట్ అయి వచ్చేశాడు. ఎవరికీ తెలియని ఆర్జే సూర్య ఇన్ని రోజులు ఉండటం కూడా ఎక్కువే అనుకుంటున్నారు చాలా మంది. అయితే ఇనయాతో లవ్ ట్రాక్ వల్లే ఆర్జే సూర్య ఇన్ని రోజులు ఉన్నారని భావిస్తున్నారు. ఇక హౌజ్ లోంచి ఎలిమినేట్ అయిన వాళ్ళతో గత సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తాడని తెలిసిందే.

ఈ ఇంటర్వ్యూలో శివ కాంట్రవర్సీ ప్రశ్నలు కూడా అడుగుతాడు. ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడిగి కంటెస్టెంట్స్ ని తికమక పెడతాడు. శనివారం హౌజ్ లోంచి వచ్చిన ఆర్జే సూర్యని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేసాడు శివ. హౌజ్ లో తను చేసిన పనులని ప్రశ్నిస్తూ సూర్యతో ఆడుకున్నాడు. బిగ్‌బాస్ లో ఈ సారి బాగా వర్కౌట్ అయిన ఇనయా సూర్య లవ్ ట్రాక్ గురించి అడిగాడు.

దీనికి సూర్య ఇనయాను మోటివేట్‌ చేయడానికి తనతో ఎక్కువగా ఉన్నాను, తనతో మాట్లాడాను అని చెప్పాడు. అంతకుముందు ఆరోహితో కూడా క్లోజ్ గా ఉన్నావు కదా అని అడిగితే నేనెవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లతో ముడిపెట్టేస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశాడు. మరి ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు అని కొన్ని మీమ్స్ చూపించాడు. బిగ్‌బాస్ హౌజ్ లో సూర్య స్టార్టింగ్ లో ఫెమినిస్ట్ అని చెప్పి ఆ తర్వాత అమ్మాయిలకి హగ్స్ ఇవ్వడం, ఇనయా లవ్ ట్రాక్ గురించి కొన్ని మీమ్స్ చూపించాడు శివ. సూర్య.. మీమర్స్ కి పనేం లేదు, వాళ్ళు వంద చేస్తారు ఇలాంటివి. ఇవి అసలు పట్టించుకోను అని అన్నాడు. దీంతో మీమర్స్ ని గెలికాడు ఆర్జే సూర్య. ఇంకేముంది సోషల్ మీడియాలో నెటిజన్లు, మీమర్లు ఆర్జే సూర్యని ట్రోల్ చేస్తున్నారు.

BiggBoss 6 Day 56 : సండే ఎలిమినేషన్ లేకుండా.. మరోసారి కొత్తగా బిగ్‌బాస్

అలాగే ఇనయా గురించి మాట్లాడగా తనే నాకు దగ్గరైంది, నేనేంటే ఇష్టం అని చెప్పింది అని సూర్య చెప్పడంతో బిగ్‌బాస్ హౌజ్ లోని ఓ సీక్రెట్ వీడియో బయటపెట్టాడు శివ. అందులో రేవంత్ తో ఇనయా సూర్య గురించి నెగిటివ్ గా చెప్పడంతో సూర్య షాకయ్యాడు.