Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..

‘సీఎం ఎన్టీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ‘జై ఎన్టీఆర్’ జెండాలతో పట్టణంలో హల్ చల్ చేశారు తారక్ ఫ్యాన్స్..

Jr NTR Fans : ‘సీఎం ఎన్టీఆర్’.. కుప్పంలో ఫ్యాన్స్ నినాదాలు..

Jr Ntr Fans

Jr NTR Fans: తెరమీద హీరోయిజం చూపించే యాక్టర్లకు లక్షల్లో అభిమానులకు ఉంటారనే సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా మంది అభిమానులు చేసే పనే. అయితే కొందరు అభిమానులు చేసే పనులు శృతి మించడంతో పాటు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి.

Jr NTR: మాట వ్యక్తిత్వానికి ప్రమాణం.. అసెంబ్లీలో ఘటనపై తారక్!

ఇప్పుడు కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేసిన హంగామా గురించి అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినిమా పరిశ్రమలోనూ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. వివరాళ్లోకి వెళ్తే.. ఆదివారం కుప్పంలోని SRM థియేటర్‌లో తారక్ ఫ్యాన్స్ ‘జై లవకుశ’ సినిమా స్పెషల్ షో వేసుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా పోగయ్యారు..

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

‘సీఎం ఎన్టీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై ఎన్టీఆర్’ జెండాలతో పట్టణంలో హల్ చల్ చేశారు.. కుప్పం పట్టణంలోని సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అయితే కుప్పంలో అనూహ్యంగా చోటు చేసుకున్న ఎన్టీఆర్ అభిమానుల కలయికపై సర్వత్రా చర్చ నడుస్తోంది.. వేలాది మంది బైక్ ర్యాలీ చేపట్టాలని ప్రయత్నించగా.. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు వెనుదిరిగారు.