Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?

చైతూ, సమంతలు విడాకులు తీసుకోవడానికి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కారణమా ? వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?

Ameerkhan

Divorce Expert Aamir Khan : టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా పేరొందిన నాగ చైతన్య – సమంతలు విడాకులు తీసుకున్నారు. తమ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు అధికారికంగా…శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. వాళ్లు విడిపోవడాన్ని ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. విడిపోవద్దని వారు కోరుతున్నారు. అయితే…వీరి విడాకులు తీసుకోవడానికి బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కారణమా ? వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Read More : K9 Vajra: రంగంలోకి కే9 వజ్రా.. శత్రువుల వెన్నులో వణుకే..!

సమంత – నాగ చైతన్యలు విడాకులు తీసుకోవడానికి అమీర్ ఖాన్ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల కింద ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ ను కలిశాడని, ఆ వెంటనే తన భార్యకు సౌత్ హీరో విడాకులు ఇచ్చారని వెల్లడించారు. సదరు బాలీవుడ్ హీరోకి విడాకుల స్పెషలిస్టుగా పేరు ఉందంటూ వ్యంగ్యంగా అభివర్ణించారు. ఎందరో మహిళలు, పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, పదేళ్లు రిలేషన్ షిప్ లో ఉండి..నాలుగేళ్లు వైవాహిక జీవితాన్ని గడిపిన హీరో..విడాకుల స్పెషలిస్టుని కలిసిన వెంటనే తన భార్యకు విడాకులు ఇచ్చాడని కంగానా వెల్లడించారు. మహిళలు బలిపశువులుగా మారడం ఆనవాయితీ అని, దుస్తులు మార్చినంత మాత్రానా ఆడవాళ్లను మార్చేసే పురుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు కంగనా.. ఈమె చేసిన వ్యాఖ్యలు ఎలాంటి రచ్చ చెలరేగుతుందో చూడాలి.

Read More : Kaathu Vaakula Rendu Kadhal: సామ్, నయన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఓటీటీలోనే?

బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చైతు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నాడు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘లాల్ సింగ్ చద్దా’.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు.. ఈ సినిమాలో నాగ చైతన్య ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ లో దాదాపు అరగంట సేపు చైతన్య రోల్ ఉంటుదని సమాచారం. టాలీవుడ్ నటుడు నాగ చైతన్య షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో గతంలో తెగ వైరల్ గా మారింది. ఇందులో నాగ చైతన్యతో పాటు..అమీర్ ఖాన్, కిరణ్ రావులున్నారు.