Kaathu Vaakula Rendu Kadhal: సామ్, నయన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఓటీటీలోనే?

నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా యమా క్రేజీగా దూసుకుపోతుంది. నయన్ చేతిలో ఇప్పుడు ఏడెనిమిది సినిమాలు ఉండగా ఇందులో తెలుగు, తమిళ, మళయాళంతో పాటు హిందీ సినిమా కూడా ఉంది.

Kaathu Vaakula Rendu Kadhal: సామ్, నయన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఓటీటీలోనే?

Kaathu Vaakula Rendu Kadhal

Updated On : October 3, 2021 / 8:24 AM IST

Kaathu Vaakula Rendu Kadhal: నయనతార ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా యమా క్రేజీగా దూసుకుపోతుంది. నయన్ చేతిలో ఇప్పుడు ఏడెనిమిది సినిమాలు ఉండగా ఇందులో తెలుగు, తమిళ, మళయాళంతో పాటు హిందీ సినిమా కూడా ఉంది. గోపిచంద్ ఆరడుగుల బులెట్ విడుదలకి సిద్ధంగా ఉండగా చిరుతో గాడ్ ఫాదర్ సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక తమిళంలో రజనీ అన్నాత్తైతో పాటు మరో రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి.

Alia Bhatt: టార్గెట్ 2022.. సీనియర్ హీరోయిన్స్‌ను మించిపోతున్న అలియా

ఇందులో కథు వాకుల రెండు కాదల్ నయన్ కి స్పెషల్ సినిమా. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కే ఈ సినిమాలో సమంత, నయనతార హీరోయిన్లు. నయన్ ప్రియుడు దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే ఈ సినిమా వస్తోండగా.. నయనతారనే నిర్మాత. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఒక్క తమిళంలోనే కాకుండా సౌత్ అన్ని బాషలలో ఈ సినిమా విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.

ChaySam BreakUP: చైతూ సమంత బ్రేకప్.. హీరో సిద్ధార్థ్ ట్వీట్ వైరల్!

కాగా, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజ్ చేసేందుకు చర్చలు సాగుతున్నాయని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతానికి మేకర్స్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.