Kangana Ranaut : కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ని టబునే కాపాడింది.. కంగనా!

కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ని సీనియర్ హీరోయిన్ టబునే కాపాడింది అంటూ బి-టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్ చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుంది. ఏ జోనర్‌తో వచ్చిన, ఎంతటి బడ్జెట్ తో వచ్చిన ప్రేక్షకులు సినిమాని ఆదరించడం లేదు. ఈ సమయంలో సీనియర్ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

Kangana Ranaut : కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ని టబునే కాపాడింది.. కంగనా!

Kangana said Tabu saved the Bollywood

Kangana Ranaut : కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ని సీనియర్ హీరోయిన్ ‘టబు’నే కాపాడింది అంటూ బి-టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్ చేసింది. గత కొంతకాలంగా బాలీవుడ్ కి గడ్డు కాలం నడుస్తుంది. ఏ జోనర్‌తో వచ్చిన, ఎంతటి బడ్జెట్ తో వచ్చిన ప్రేక్షకులు సినిమాని ఆదరించడం లేదు. ఒక్కపుడు రూ.100 కోట్ల కోల్లెక్షన్స్ ఈజీగా అందుకున్న టాప్ హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని మూట కట్టుకుంటున్నాయి.

Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని సపోర్ట్ చేస్తున్న కంగనా..

ఈ సమయంలో సీనియర్ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకప్పటి గ్లామర్స్ బ్యూటీ ‘టబు’ ఈ ఏడాది రెండు సినిమాల్లో ప్రధానపాత్రలో నటించి అలరించింది. అందులో ఒకటి హారర్ కామెడీ థిల్లర్ ‘భూల్ భులయా 2’.. దాదాపు రూ.250 కోట్లు అందుకుని బాలీవుడ్ కి ప్రాణం పోసింది.

తాజాగా అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ కూడా మంచి విజయాన్ని నమోదు చేస్తుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.75 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో కూడా టబు ప్రధానపాత్రలో కనిపించడంతో.. కంగనా ఆ కామెంట్స్ చేసింది. తన ఒంటి చేతితో హిందీ పరిశ్రమని టబు కాపాడింది అంటూ కంగనా రనౌత్ వెల్లడించింది. కాగా ఈ శుక్రవారం విడుదలైన దృశ్యం 2 బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి కలిసొచ్చింది.