Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని సపోర్ట్ చేస్తున్న కంగనా..

44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ మీద షాక్ లు ఇస్తున్నాడు. కాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న ప్రతి ఒక్కరు నెలకి $8 డాలర్లు చెల్లించాలంటూ మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకోగా.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురుకుంటున్నాడు ఎలాన్. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తూ..

Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని సపోర్ట్ చేస్తున్న కంగనా..

Kangana Ranaut Supports Elon Musk Blue Tick Decision

Kangana Ranaut: 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసి ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ .. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ మీద షాక్ లు ఇస్తున్నాడు. ట్విట్టర్ ‘సీఈఓ’గా పని చేస్తున్న భారతీయుడు ‘పరాగ్ అగర్వాల్’ నుండి మొదలుపెట్టి, పలు విభాగాల్లో కీలక ఉద్యోగులను తొలగించడంతో పాటు వారంరోజుల్లోనే 50శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలిగించి నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యవహరిస్తున్నాడు.

Kangana Ranaut : రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కంగనా రనౌత్

కాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉన్న ప్రతి ఒక్కరు నెలకి $8 డాలర్లు చెల్లించాలంటూ మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకోగా.. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదురుకుంటున్నాడు ఎలాన్. అయినా సరే ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదంటున్నాడు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసింది. బ్లూ టిక్ కొంత డబ్బుని వసూలు చేయడం మంచి నిర్ణయమే అంటుంది ఈ భామ.

ఉచితంగా సదుపాయం కలిపిస్తే అది ఆ సంస్థకు ఎటువంటి లాభం తెచ్చిపెడుతుంది. మనీ కలెక్ట్ చేయడం వల్ల ట్విట్టర్ కూడా మెరుగు పడుతుందంటూ వ్యాఖ్యానించింది. అయితే 2021లో నిబంధనల ఉల్లంఘన కారణాల వల్ల ఆ సంస్థ ఈ అమ్మడి ట్విట్టర్ ఖాతాపై నిషేధం విధించింది. మరి ఈ కొత్త రూల్స్ తో ద్వారా.. కంగనాకు మళ్ళీ ట్విట్టర్ అకౌంట్ ని కలిపించనుందో లేదో చూడాలి.