Mahesh Babu: మహేష్ తండ్రిగా కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాలో మహేష్....

Mahesh Babu: మహేష్ తండ్రిగా కన్నడ స్టార్ హీరో.. ఎవరంటే?

Kannada Hero Ravichandran As Mahesh Babu Father

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. చాలా రోజుల తరువాత మహేష్ నుండి ఊరమాస్ డైలాగులు రావడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన విధానం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ చిత్రాల కోసం రెడీ అవుతున్నాడు.

Mahesh Babu: ఆ సంగతి మర్చిపోయిన మహేష్.. గుర్తుచేస్తున్న ఫ్యాన్స్!

తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసిన మహేష్, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేయబోయేది మహేష్ బాబు తండ్రి పాత్ర అని తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు ఈ పాత్ర కోసం మరో యాక్టర్ పేరు వినిపిస్తోంది.

Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!

కన్నడ స్టార్ హీరో ఎ.రవిచంద్రన్ మహేష్ బాబు తండ్రిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ తండ్రి పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అందుకే దక్షిణాదిన పరిచయం ఉన్న హీరో అయితే ఇక్కడి ప్రేక్షకులకు ఆ పాత్ర చాలా బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ హీరో రవిచంద్రన్ అయితే మహేష్ తండ్రిగా పర్ఫెక్ట్‌గా ఉంటారని.. అంతేగాక తెలుగు తెరకు ఫ్రెష్ ఫేస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను జూలై నుంచి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.