Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ-2’ గతవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేస్తోంది. కాగా, నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ, ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఉత్తారదిన కూడా ఈ సినిమాకు క్రేజ్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది.

Karthikeya 2 Creating Sensation In North Belt: బాలీవుడ్‌ను గడగడలాడిస్తున్న కార్తికేయ 2

Karthikeya 2 Creating Sensation In North Belt

Karthikeya 2 Creating Sensation In North Belt: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ-2’ గతవారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడేస్తోంది. ఈ సినిమాలోని సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు అడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక కృష్ణతత్వం గురించి ఈ సినిమాలో చాలా విషయాలు ఉండటం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా, నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా చాలా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

Karthikeya2: మిస్టరీ వీడేది అప్పుడే అంటోన్న కార్తికేయ!

కానీ, ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ఉత్తారదిన కూడా ఈ సినిమాకు క్రేజ్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. ఇక గతకొద్ది రోజుల్లోనే ఈ సినిమాకు అక్కడ భారీ రెస్పాన్స్ వస్తుండటంతో బాలీవుడ్ గడగడలాడిపోతుంది. కార్తికేయ-2 రిలీజ్ అయ్యే సమయానికి ఇద్దరు బాలీవుడ్ బడా స్టార్స్ తమ సినిమాలను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. కానీ వారి సినిమాల్లోని కంటెంట్ ప్రేక్షకులను ఏ విధంగానూ అలరించకపోవడంతో, ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ఈ అంశం కార్తికేయ-2 చిత్రానికి బాగా కలిసొచ్చింది. అంతేగాక, ఈ సినిమాలోని మిస్టరీ ఎలిమెంట్స్ అక్కడి ఆడియెన్స్‌ను ఈ సినిమాను చూసేలా చేస్తోంది.

Karthikeya 2 Locks OTT Partner: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కార్తికేయ-2

రిలీజ్ రోజున కేవలం 50+ స్క్రీన్స్‌తో రిలీజ్ అయిన కార్తికేయ-2 చిత్రం ఇప్పుడు ఏకంగా 1000+ స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతోంది. అంటే.. కేవలం వారం రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు ఈ వారాంతం కూడా బాగా కలిసొస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ లెక్కన కార్తికేయ-2 కేవలం తెలుగు నాటే కాకుండా నార్త్ బెల్ట్‌లోనూ దుమ్ములేపుతుండటం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ దిగ్విజయంగా దూసుకుపోతుంది.