Karthikeya 2 Locks OTT Partner: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కార్తికేయ-2

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కార్తికేయ-2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Karthikeya 2 Locks OTT Partner: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న కార్తికేయ-2

Karthikeya 2 Locks OTT Partner: టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కార్తికేయ-2’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. కేవలం సౌత్‌లోనే కాకుండా ఈ సినిమాకు నార్త్ బెల్ట్‌లోనూ రోజురోజుకూ ఆదరణ పెరిగిపోతుంది. ఇక నిఖిల్ సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.

Karthikeya 2 Three Days Collections: 3 రోజుల కలెక్షన్స్‌‌తో అదరగొట్టిన కార్తికేయ-2!

ఈ సినిమాలో కృష్ణతత్వం గురించి చాలా అద్భుతంగా వివరించడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఇందులోని మిస్టరీ ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Karthikeya 2 Success Meet: కార్తికేయ 2 సక్సెస్ మీట్ ఫోటోలు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అయిన 4 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫాం ప్లాన చేస్తోంది. ఈ సినిమాల అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందించగా, అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు.