Karthikeya 2 Three Days Collections: 3 రోజుల కలెక్షన్స్‌‌తో అదరగొట్టిన కార్తికేయ-2!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా శనివారం రిలీజ్ అయినా, వీకండ్‌లో ఈ సినిమా తన సత్తా చాటింది. అటు సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనబరిచారు.

Karthikeya 2 Three Days Collections: 3 రోజుల కలెక్షన్స్‌‌తో అదరగొట్టిన కార్తికేయ-2!

Karthikeya 2 Three Days Collections Crosses 25 Cr Worldwide

Karthikeya 2 Three Days Collections: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా, ఔట్ అండ్ ఔట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే ప్రేక్షకుల నుండి అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు.

Karthikeya 2 Two Days Collections: కార్తికేయ-2 రెండు రోజుల కలెక్షన్స్.. ఎంతంటే?

కాగా, ఈ సినిమా శనివారం రిలీజ్ అయినా, వీకండ్‌లో ఈ సినిమా తన సత్తా చాటింది. అటు సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని కనబరిచారు. ఇలా వరుసగా మూడు రోజుల సెలవులు కార్తికేయ 2 చిత్ర వసూళ్లు పెరగడానికి దోహదపడ్డాయి. ఇక ఈ సినిమా మూడు రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.26 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.

Karthikeya 2 Collections: అమెరికాలో అదరగొట్టిన కార్తికేయ-2.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కేవలం మూడు రోజుల్లోనే కార్తికేయ 2 చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు కూడా చేరుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక మూడు రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ-2 సినిమా కలెక్షన్స్ ఏరియా వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 4.06 కోట్లు
సీడెడ్ – 1.83 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.51 కోట్లు
ఈస్ట్ – 0.99 కోట్లు
వెస్ట్ – 0.73 కోట్లు
గుంటూరు – 1.14 కోట్లు
కృష్ణా – 0.87 కోట్లు
నెల్లూరు – 0.41 కోట్లు
ఏపీ+తెలంగాణ – రూ.11.54 కోట్లు(రూ.17.80 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు
ఓవర్సీస్ – 2.60 కోట్లు
నార్త్ ఇండియా – 0.60 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.15.44 కోట్లు(రూ.26.50 కోట్ల గ్రాస్)