Karthikeya 2 Collections: అమెరికాలో అదరగొట్టిన కార్తికేయ-2.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.

Karthikeya 2 Collections: అమెరికాలో అదరగొట్టిన కార్తికేయ-2.. రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Karthikeya 2 Collections In US Shocked Everyone

Karthikeya 2 Collections: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ-2’ రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక రిలీజ్ రోజునే ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. కార్తికేయ-2 చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Karthikeya 2 : మొదటి రోజు 50.. రెండో రోజు 300 షోలు.. నార్త్ లో అదరగొడుతున్న కార్తికేయ 2..

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా అక్కడ భారీ విజయంవైపు దూసుకెళ్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే అమెరికా వ్యాప్తంగా ఏకంగా $450K+ డాల్లరు వసూలు చేసి ఔరా అనిపించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన కార్తికేయ-2 చిత్రం అలవోకగా హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Karthikeya 2: నిఖిల్‌కు కార్తికేయ-2 అగ్నిపరీక్ష..?

చందూ మొండేటి కథ అద్భుతంగా ఉండగా, నిఖిల్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉందని.. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా మిస్టరీ సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష, అనుపమ్ ఖేర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అభిషేక్ అగర్వల్, టిజి విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందించారు.