Karthikeya 2 : మొదటి రోజు 50.. రెండో రోజు 300 షోలు.. నార్త్ లో అదరగొడుతున్న కార్తికేయ 2..

ఇటీవల మన తెలుగు, సౌత్ సినిమాలు నార్త్ లో బాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 కూడా నార్త్ లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో అక్షయ్, అమీర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో మొదటి రోజు నార్త్ లో కేవలం 50 షోలు మాత్రమే............

Karthikeya 2 : మొదటి రోజు 50.. రెండో రోజు 300 షోలు.. నార్త్ లో అదరగొడుతున్న కార్తికేయ 2..

karthikeya 2

Karthikeya 2 :  నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది కార్తికేయ 2. అనేక వాయిదాల అనంతరం ఇటీవల ఆగస్టు 13న ఈ సినిమా రిలీజ్ అయింది. సినిమాపై ముందునుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. అయితే ముందు నుంచి ఈ సినిమాకి థియేటర్ల సమస్య ఉందని వాపోతున్నారు చిత్ర యూనిట్. సినిమా హిట్ కొట్టినా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇవ్వట్లేదంటూ నిఖిల్ తెలిపాడు.

Pawan Kalyan: జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఇక ఇటీవల మన తెలుగు, సౌత్ సినిమాలు నార్త్ లో బాగా ఆడుతున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 కూడా నార్త్ లో మంచి టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో అక్షయ్, అమీర్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో మొదటి రోజు నార్త్ లో కేవలం 50 షోలు మాత్రమే పడ్డాయి కార్తికేయ 2కి. టాక్ బాగుండటంతో రెండో రోజుకి 200 షోలు, మూడో రోజుకి 300 షోలు పడుతున్నాయి. అటు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కార్తికేయ 2కి బాగా కలిసొచ్చింది. రోజు రోజుకి థియేటర్స్ ని, షోలని పెంచుతున్నారు. కార్తికేయ 2 సినిమాకి బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.