Karthikeya 2: నిఖిల్‌కు కార్తికేయ-2 అగ్నిపరీక్ష..?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక హీరో నిఖిల్‌కు కార్తికేయ 2 చిత్రం అగ్నిపరీక్ష పెట్టబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Karthikeya 2: నిఖిల్‌కు కార్తికేయ-2 అగ్నిపరీక్ష..?

Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కావడంతో, కార్తికేయ-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హీరో నిఖిల్‌కు కార్తికేయ 2 చిత్రం అగ్నిపరీక్ష పెట్టబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Karthikeya 2: కార్తికేయ-2, మాచర్ల నియోజకవర్గం టికెట్ రేట్లు ఇవే!

గతకొంత కాలంగా నిఖిల్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు. ఈ హీరో చేసిన సినిమాల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకుని, తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నిఖిల్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు పోటీగా బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా వస్తుండటం.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొనడంతో కార్తికేయ 2 చిత్రం ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.

Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఇప్పటికే కార్తికేయ 2 సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవ్వడంలో సహాయపడ్డాయి. ఈ సినిమాను మరోసారి మిస్టరీ సస్పెన్స్ కథతో దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా, ఇందులో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.