Karthikeya 2: కార్తికేయ-2, మాచర్ల నియోజకవర్గం టికెట్ రేట్లు ఇవే!

టాలీవుడ్‌లో ఇటీవల సినిమాల సక్సెస్‌పై ప్రభావం చూపిన అంశంగా టికెట్ రేట్లు నిలవడంతో, ప్రస్తుతం సినిమా దర్శకనిర్మాతలు ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలను ఎలాంటి టికెట్ రేట్ల పెరుగుదల లేకుండా రిలీజ్ చేస్తున్నారు.

Karthikeya 2: కార్తికేయ-2, మాచర్ల నియోజకవర్గం టికెట్ రేట్లు ఇవే!

Karthikeya 2: టాలీవుడ్‌లో ఇటీవల సినిమాల సక్సెస్‌పై ప్రభావం చూపిన అంశంగా టికెట్ రేట్లు నిలవడంతో, ప్రస్తుతం సినిమా దర్శకనిర్మాతలు ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలను ఎలాంటి టికెట్ రేట్ల పెరుగుదల లేకుండా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వారం రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతుండటం.. రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవడంతో ఈ సినిమాలకు ఎలాంటి టికెట్ రేట్లు ఉంటాయా అనే సందేహం ప్రేక్షకుల్లో నెలకొంది.

Karthikeya 2 Theatrical Trailer : కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ!

అయితే తాజాగా ఈ రెండు సినిమాల టికెట్ రేట్ల గురించి ఆయా చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తున్న పాన్ ఇండియా మూవీ కార్తికేయ-2.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.147(ఏపీలో), రూ.150(తెలంగాణలో) మరియు మల్టీప్లెక్స్‌లలో రూ.177(ఏపీ), రూ.200(తెలంగాణలో) ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం వారికే ఎక్కువగా నచ్చుతుంది – కృతి శెట్టి

ఇది సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే టికెట్ రేట్లని నిర్మాతలు చెబుతున్నారు. ఏదేమైనా ఇటీవల సీతా రామం, బింబిసార చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడంతో, ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగానే పెరిగాయి. మరి రెండు డిఫరెంట్ జోనర్లతో వస్తున్న మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటాయో తెలియాలంటే ఈ నెల 12, 13వ తేదీల వరకు వెయిట్ చేయాల్సిందే.