Karthikeya 2 Theatrical Trailer : కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠతను క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Karthikeya 2 Theatrical Trailer : కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్.. మరో బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ!

Karthikeya 2 Theatrical Trailer: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ-2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ నిఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘కార్తికేయ-2’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఈ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Karthikeya 2 : నితిన్‌తో పోటీ తప్పుకున్న నిఖిల్.. కార్తికేయ 2 మళ్ళీ వాయిదా

ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠతను క్రియేట్ చేయడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. శ్రీకృష్ణుడి చరిత్రకు సంబంధించి పలు మిస్టరీలను చేధించేందుకు జరిగే ప్రయాణమే ఈ కార్తికేయ 2 సినిమా కథగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ కట్ అద్భుతంగా, సస్పెన్స్‌తో ఉండటంతో ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని సినీ వర్గాలు అంటున్నాయి. నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Karthikeya 2: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన కార్తికేయ2..ఎప్పుడంటే?

కార్తికేయ పాత్రలో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసేందుకు నిఖిల్ రెడీ కాగా, అందాల భామ అనుపమ పరమేశ్వరన్, బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీని ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను టిజి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.