Karthikeya 2: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన కార్తికేయ2..ఎప్పుడంటే?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి పూర్తి మిస్టరీ థ్రిల్లర్ కథగా తెరకెక్కించగా, ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Karthikeya 2: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన కార్తికేయ2..ఎప్పుడంటే?

Karthikeya 2: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ మూవీగా ఇప్పటికే ‘కార్తికేయ-2’ ఎలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఎంతో కాలంగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరోసారి లీడ్ రోల్‌లో నటిస్తున్న కార్తికేయ-2 చిత్రాన్ని దర్శకుడు చందూ ముండేటి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడు. ఈ సినిమాలోని అడ్వెంచర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Karthikeya2: మిస్టరీ వీడేది అప్పుడే అంటోన్న కార్తికేయ!

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని.. వారిని మరిన్ని రోజులు వెయిట్ చేయించకుండా ఉండేందుకు ఈ చిత్ర ట్రైలర్‌ను ఆగస్టు 6న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. గతంలో వచ్చిన కార్తికేయ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో, అంతకుమించిన అంశాలను ఈ సినిమాలో పెట్టామని.. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్ మరోసారి మనల్ని ఆకట్టుకునే విధంగా మలిచినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

Karthikeya 2: సెన్సార్ ముగించుకున్న కార్తికేయ 2

ఈ సినిమాలో నిఖిల్ సరసన అందాల భామ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కాళభైరవ సంగీతం అందిస్తుండగా.. టీజీ.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాపై దక్షిణాదితో పాటు నార్త్‌లోనూ మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.