Karthikeya 2: సెన్సార్ ముగించుకున్న కార్తికేయ 2

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కార్తికేయ-2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రం సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

Karthikeya 2: సెన్సార్ ముగించుకున్న కార్తికేయ 2

Karthikeya 2 Completes Censor Work

Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కార్తికేయ’. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ-2 చిత్రాన్ని రూపొందించింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా ముగిసిపోయాయి. ఈ చిత్రాన్ని మరోసారి మిస్టరీ థ్రిల్లర్‌గా అదిరిపోయే ట్విస్టులతో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

Karthikeya 2 : సీరియల్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్.. ప్రమోషన్స్ లో కొత్త స్టంట్..

అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ మిస్టరీ అంశాలతో ప్రేక్షకులను ఉత్కంఠానికి గురిచెయ్యడం ఖాయమని సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌ను అభినందించిందట. ఇక నేటితరం ప్రేక్షకులు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉందని వారు అన్నారట. ఈ సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయనుండగా, చందూ మొండేటి ఈ సినిమాను వైవిధ్యమైన కథాంశంతో తీర్చిదిద్దాడు.

Karthikeya 2 : ‘కార్తికేయ‌ 2’ – ఇంటెన్స్ లుక్‌‌తో నిఖిల్..

కాగా, ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ మూవీని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.